Ajit Pawar : అధికారం శాశ్వతం కాదు – అజిత్ పవార్
ఇవాళ ఉంటుంది రేపు పోతుంది
Ajit Pawar : ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ అధికారంలో ఉన్నామని మిడిసి పడుతున్న వాళ్లు రేపటికి పవర్ లో ఉండే ఛాన్స్ ఉండదన్న వాస్తవం గుర్తించాలన్నారు. అధికారం అన్నది ఎన్నటికీ శాశ్వతం కాదని తెలుసు కోవాలన్నారు. పవర్ వస్తుంది రేపు పోతుంది..ఇందులో విచారించేందుకు లేదా ఆనందం పొందేందుకు వీలు కాదన్నారు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ప్రచార కార్యక్రమంలో అజిత్ పవార్(Ajit Pawar) ప్రసంగించారు.
మహారాష్ట్రలో గత ఏడాది రాజకీయ సంక్షోభానికి సంబంధించిన పిటిషన్లపై కోర్టు తీర్పులు పెండింగ్ లో ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పడిపోయేందుకు అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్సీపీ అగ్ర నాయకుడు.
మునపటి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. హోదాలు, పదవులు శాశ్వతం కాదు.
ఇదే సమయంలో పవర్ లో ఉన్నామని ఆనందం చెందే లోపు ప్రజలు దించే రోజు తప్పకుండా వస్తుందని జోష్యం చెప్పారు. ప్రభుత్వం కలకలం ఉండదన్న సత్యాన్ని భారతీయ జనతా పార్టీ, శివసేన షిండే వర్గం ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు.
అధికారం ఎవరికీ శాశ్వతంగా ఉండదు. వెండి చెంచాతో ఎవరూ పుట్టరు. పవర్ వస్తుంది..పోతుంది. మరాఠా రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు నిర్ణయం ఇంకారావాల్సి ఉంది. ఎన్నికల సంఘం కూడా తన తుది తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏమైనా జరగొచ్చు. ఎమ్మెల్యేలపై గనుక అనర్హత వేటు పడితే మళ్లీ సర్కార్ మారేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని జోష్యం చెప్పారు.
Also Read : పవర్ లోకి వస్తే ప్రజా పాలన – ఖర్గే