#PragyaJaiswal : స‌ల్మాన్ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్

కంచెతో మెరిసిన తార

Pragya Jaiswal  : ప్ర‌ముఖ టాలీవుడ క్రియేటివ్ డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కంచె అప్ప‌ట్లో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. క్రిష్ అనే స‌రిక‌ల్లా లోతైన క‌థ‌, హృద‌యాల‌ను హ‌త్తుకునే స‌న్నివేశాలు, పాత్ర‌లకు మంచి స్కోప్ ఉండేలా చూస్తాడు. ఆయ‌న‌కు మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్టర్ గా పేరుంది. చేసే సినిమాలు కొద్దివే అయినా ప్ర‌తి సినిమా దేనిక‌దే ప్ర‌త్యేకం.

వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ అయిన ఆయ‌న సినిమా మీద ఉన్న పేష‌న్ తో ఇక్క‌డికి వ‌చ్చాడు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది గ‌మ్యం సినిమా. ఆ మూవీలో ఆయ‌న పాత్ర‌ల ద్వారా లేవనెత్తిన ప్ర‌శ్న‌లు స‌మాజాన్ని ఒకింత భ‌యానికి లోను చేశాయి. క్రిష్ ఎంచుకునే వ్య‌క్తులు, పాత్ర‌లు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి.

ప్ర‌తి దానికి ఏదో ఒక స్పెషాలిటీ లేక పోతే జీవితానికి సినిమాకు ఇంకేం అర్థం ఉంటుంది అంటాడు క్రిష్. ఆయ‌న బాల‌కృష్ణ‌తో తీసిన మ‌హానాయ‌కుడు దివంగ‌త ఎన్టీఆర్ బ‌యోపిక్. దీని నేప‌థ్యం హ‌త్తుకుంది. ఇక కంచె సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అందులోని ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకునేలా చేసింది.  ఆ సినిమాలో త‌ళుక్కున మెరిసింది ప్ర‌గ్యా జైస్వాల్(Pragya Jaiswal ).

ఆమెకు ఆ ఒక్క సినిమాతో ఒక్క‌సారిగా స్టార్ డ‌మ్ వ‌చ్చేసింది. తాజాగా ఈ అమ్మ‌డు స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ చిత్రం అంతిమ్ లో న‌టించ‌నుంది. ఇందులో స‌ల్మాన్ బావ‌మ‌రిది ఆయుష్ శ‌ర్మ విల‌న్ గా న‌టిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బోయ‌పాటి శ్రీ‌ను, బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ద‌క్కించుకుంది. రెండు ప్రాజెక్టులు పెద్ద‌వే. ఈ ఇయ‌ర్ లో ప్ర‌గ్యా జైశ్వాల్(Pragya Jaiswal )కు క‌లిసొచ్చింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

No comment allowed please