Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి.. కన్నయ్యకు సీఎం చంద్రబాబు సన్మానం
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి.. కన్నయ్యకు సీఎం చంద్రబాబు సన్మానం
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. కేవలం 5 రోజులలోపే మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతు పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ చీఫ్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు మార్గదర్శనలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పూర్తయ్యాయి. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టి పూర్తి చేసింది. రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్య సన్మానించారు. మార్గదర్శనం చేసిన కన్నయ్యను తిరిగి ఇంజినీర్లు, అధికారులు సన్మానించారు.
Prakasam Barrage – కష్టపడ్డాం.. పూర్తి చేశం
ఈ సందర్భంగా కన్నయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సహకారం, ప్రోత్సాహంతోనే పనులు వేగంగా పూర్తి చేశామన్నారు. గేట్లు మరమ్మతు పనులు శరవేగంగా చేశామని.. ప్రస్తుతం ఆ మూడు గేట్లూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. రైతులకు నష్టం జరగకూడదనే రేయింబవళ్లు కష్టపడి పని చేసి పూర్తి చేశామని నాయుడు వెల్లడించారు. అంతేకాదు.. ఏపీలో లక్షలాది ఎకరాల్లో ఉన్న పంట పొలాలను రక్షించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇదిలా ఉంటే.. ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage)కి పూర్తి అయిన విరిగిపోయిన కౌంటర్ వెయిట్ తొలగించడం జరిగింది. దగ్గరుండి పనులను నిపుణుడు కన్నయ్య పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. కాగా.. రేపటి నుంచి బోట్లు తొలగింపు ప్రకీయను అధికారులు ప్రారంభించనున్నారు.
Also Read : MLA Harish Rao: పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి ! హరీష్‌రావు సీరియస్ ?