Prakash Raj : వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి దేశ వ్యాప్తంగా. 1980కి ఆఖరులో 1990లో కశ్మీరీ పండిట్లపై చోటు చేసుకున్న దారుణాలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులను తెర మీద తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు.
ఈ మూవీకి అపూర్వమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఊహించని రీతిలో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి దూసుకు పోతోంది.
ఈనెల 11న దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని సంచలనం సృష్టిస్తోంది. ఓ వైపు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తుండగా మరికొందరు మాత్రం ఇది పక్కా దేశంలో కలిసి మెలిసి ఉన్న మనుషుల మధ్య విభేదాలు సృష్టించే ప్లాన్ చేస్తోందంటున్నారు.
వాస్తవాలకు విరుద్దంగా ఉందని ఆరోపించారు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా. ఈ మూవీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ది కశ్మీర్ ఫైల్స్ పై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj )కీలక వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేసేదిగా లేదు. మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా అన్నది వేచి చూడాలంటూ ట్వీట్ చేయడం కలకలం రేపింది.
ప్రస్తుతం ఇది నెట్టింట్లో హల్ చల్ అవుతోంది. మరో వైపు ప్రధాన మంత్రితో పాటు పలు రాష్ట్రాలలో ఈ సినిమాకు మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో దర్శకుడికి వై కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర సర్కార్.
Also Read : కనిపించని సిక్కులు..ముస్లింల త్యాగం