Prakasham Barrage : ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి
భారీ వర్షాలు పెరుగుదున్న వరదలు
Prakasham Barrage : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలలో కుండ పోతగా కురుస్తున్నాయి. భారీ వర్షాల తాకిడికి ఏపీలోని ప్రకాశం బ్యారేజ్(Prakasham Barrage) కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మునేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తి వేశారు. కిందకు నీరు విడుదల చేశారు అధికారులు.
Prakasham Barrage Flow
మొత్తంగా 51 వేల 940 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. ఇదిలా ఉండగా నదీ తీరం దిగువ ప్రాంతంలో నివసించే వారిని అప్రమత్తం చేశారు. పునరావాస ప్రాంతాల్లోకి తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు తెలియ చేయాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా చేపల వేటకు వెళ్లే మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎక్కడికీ వెళ్లవద్దంటూ సూచించింది.
Also Read : Pawan Kalyan : తమిళ సినీ రంగంపై పవన్ కామెంట్స్