Praksham Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు పూర్తయిన మరమ్మతులు !

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు పూర్తయిన మరమ్మతులు !

Praksham Barrage: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్న తెలంగాణా నుండి వస్తున్న వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీ స్వల్పంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రకాశం బ్యారేజీ(Praksham Barrage)కు ఎగువన ఉన్న ఇసుక బోట్లు క్రిందకి కొట్టుకు వచ్చి బ్యారేజీ గేటుకు సంరక్షణగా ఉన్న కట్టడాన్ని ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజీ పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ మరమ్మత్తులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్‌లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నదిలో లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారుల దృష్టి సారించారు.

Praksham Barrage Gates..

ఇటీవల ప్రకాశం బ్యారేజికి చేరిన వరద ఉద్ధృతికి పడవలు(బోట్లు) వచ్చి గేట్లకు అడ్డుతగిలిన విషయం తెలిసిందే. దానిలో ఒకటి కౌంటర్‌ వెయిట్‌ను ఢీకొనడంతో విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డు పడటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా జరగలేదు. దీనితో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి.. తాజాగా పూర్తి చేశారు.

Also Read : Deepthi Jeevanji: పారాలింపిక్స్‌ పతక విజేత దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ భారీ నజరానా !

Leave A Reply

Your Email Id will not be published!