Prashant Kishor : నేత‌లు కాదు పార్టీలు ఏకం కావాలి

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్

Prashant Kishor BJP Defeat : భార‌తీయ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆక్టోప‌స్ లా విస్త‌రించింది దేశ వ్యాప్తంగా. ఈ త‌రుణంలో బ‌ల‌మైన కాషాయ పార్టీని ఎదుర్కోవాలంటే ప్ర‌తిప‌క్షాలు ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు. ఆయా పార్టీల‌కు చెందిన నేత‌ల వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor BJP Defeat) . బీజేపీని స‌వాల్ చేయాలంటే ముందు దాని బ‌లా బ‌లాల‌ను అర్థం చేసుకోవాల‌ని సూచించారు.

2024లో బీజేపీకి వ్య‌తిరేకంగా విప‌క్షాల ఐక్య‌త అస్థిరంగా , సైద్ధాంతికంగా భిన్న‌మైన‌దన్నారు. ఇది ఎప్ప‌టికీ ప‌ని చేయ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పీకే ప్ర‌శ్నించారు. హిందుత్వం, జాతీయ వాదం, సంక్షేమ వాదం వీటిని ముందుగా అర్థం చేసుకోవాల‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor).  వీటిలో క‌నీసం రెండింటిని ఉల్లంఘించ లేక పోతే బీజేపీని స‌వాల్ చేసే స్థితిలో ఉండర‌న్నారు.

హిందుత్వ భావ‌జాలంపై పోరాడాలంటే సిద్దాంతాల కూట‌మి ఉండాల‌న్నారు. గాంధేయ వాది, అంబేద్క‌రిస్టులు, సోష‌లిస్టులు, క‌మ్యూనిస్టుల భావ‌జాలం ముఖ్య‌మైద‌ని స్ప‌ష్టం చేశారు. భావ‌జాలం ఆధారంగా గుడ్డి విశ్వాసాన్ని క‌లిగి ఉండ కూడ‌ద‌న్నారు పీకే. జ‌న్ సురాజ్ యాత్ర ముఖ్య ఉద్దేశం గాంధీ కాంగ్రెస్ భావ‌జాలాన్ని పున‌రుద్ద‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు.

బీహార్ కుల ప‌ర‌మైన రాజ‌కీయాల‌కు ప్ర‌సిద్ది చెందింద‌ని దానికి భిన్నంగా చైత‌న్య‌వంతం చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నాన‌ని తెలిపారు. నా ల‌క్ష్యం కాంగ్రెస్ పున‌ర్జ‌న్మ‌. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే వారి ల‌క్ష్యం. వారు కోరుకున్న మార్గంలో నేను వెళ్ల లేను. అందుకే నా ఆలోచ‌న‌ల‌ను అమ‌లు చేయండి అన్నారు.

Also Read : రాహుల్ కు ఒమ‌ర్ అబ్దుల్లా మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!