Prashant Kishor : చంద్రబాబుతో పీకే భేటీ
రాజకీయ పరిస్థితులపై చర్చ
Prashant Kishor : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. గతంలో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ పార్టీకి పని చేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈసారి టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా త్వరలో రాష్ట్రంలో జరిగే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
Prashant Kishor will Met with Chandrababu
చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై పీకే చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎలాగైనా సరే రెండోసారి పవర్ లోకి రావాలని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వ్యూహాలు పన్నుతున్నారు.
ఇదిలా ఉండగా ఈసారి ప్రశాంత్ కిషోర్ రూటు మార్చారు. జగన్ రెడ్డికి కాకుండా టీడీపీ చీఫ్ చంద్రబాబుతో(Chandrababu) జత కట్టడం మరింత ఆసక్తిని రేపింది. చంద్రబాబుతో చర్చల సందర్భంగా తాను చేసిన సర్వేల అంశాల గురించి సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్ చర్చించారు.
ప్రభుత్వ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని ఓట్లు చీలకుండా ఉండాలని , ఆ దిశగా ప్రయత్నం చేస్తే విజయం సాధించడం ఖాయమని పీకే జోష్యం చెప్పినట్లు సమాచారం. మొత్తంగా పీకే , చంద్రబాబు మధ్య చర్చలు రాష్ట్రంలో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికలు పలువురు నేతల రాజకీయ భవిష్యత్తు నిర్ణయించనున్నాయి.
Also Read : CM Revanth Reddy : పీవీ అరుదైన ఆర్థికవేత్త – రేవంత్