Uddhav Thackeray : హిందూత్వ పేరుతో రాజకీయాలు చేయడం మాను కోవాలని హితవు పలికారు దిగ్గజ నేతలు. తెలంగాణ సీఎం ముంబై సీఎం ఉద్దవ్ ఠాక్రేతో (Uddhav Thackeray )భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. వారిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. పరిస్థితులు గనుక ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని హెచ్చరించారు.
దేశంలో ఫెడరిలిజాన్ని దెబ్బ తీసేందుకు యత్నిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని సూచించారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను తాను అభినందిస్తున్నట్లు చెప్పారు సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray ).
తాను బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తమ రాష్ట్రాల మధ్య కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ
తామిద్దరం సోదరులమని ప్రకటించారు.
ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కూడా తమ కూటమి లోకి ఆహ్వానిస్తామన్నారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్. ఇంకా పలు దశల్లో చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కొద్ది రోజుల్లో హైదరాబాద్ లో కానీ లేదా మరెక్కడైనా కానీ కూర్చని చర్చిస్తామన్నారు. దేశంలో నెలకొన్న ఉన్న పరిస్థితి, కింది స్థాయి రాజకీయాలు జరుగుతున్న తీరు హిందూత్వం కాదన్నారు.
హిందూత్వ అంటే హింస, ప్రతీకారం కాదన్నారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సహేతుకమైన బంధం గతంలో లాగా కొనసాగడం లేదన్నారు. ఇది ఫెడరిలిజం స్పూర్తిగా పూర్తిగా విరుద్దమన్నారు.
ఈ చిల్లర రాజకీయాలు పని చేయవని, కొత్తగా దీనిని ప్రారంభించామన్నారు. శివాజీ మహరాజ్ , బాలా సాహెబ్ వంటి వ్యక్తుల నుండి దేశానికి లభించిన స్పూర్తితో పోరాడాలని తాము కోరుకుంటున్నామన్నారు.
Also Read : అంపశయ్యపై తెలంగాణ – ఆర్ఎస్పీ