Rajya Sabha: నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Rajya Sabha : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ దైత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్‌లను రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్‌ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ వంటి రంగాలలో కృషి చేసిన వారిని ఈ స్థానాలకు నామినేట్‌ చేస్తారు.రాజ్యాంగంలోని క్లాజ్ త్రీలో గల ఆర్టికల్ 80(1)(ఎ) ద్వారా మంజూరయిన అధికారాల ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు (Rajya Sabha) నలుగురు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేశారు. గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నామినేషన్లు దాఖలు చేశారు.

Rajya Sabha – రాజ్యసభకు నామినేట్‌ చేసిన ప్రముఖుల ప్రస్థానం ఇదే

ఉజ్వల్ నికం

దేశంలోని ప్రముఖ న్యాయవాదులలో ఉజ్వల్ నికం ఒకరు. 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసు విచారణ, ఇతర హై-ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ముంబయి నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి… కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు.

హర్ష్ వర్ధన్ శ్రింగ్లా

భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ … అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లకు రాయబారిగా విధులు నిర్వహించారు. కీలక దౌత్య పదవులు చేపట్టారు. 2023లో భారతదేశ G20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.

సి సదానందన్ మాస్టర్

కేరళకు చెందిన సి. సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. సామాజిక కార్యకర్తగా… బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. 1994లో సీపీఎం నేతల దాడిలో ఆయన రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేశారు.

మీనాక్షి జైన్

మీనాక్షి జైన్ ప్రముఖ చరిత్రకారిణిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గానూ విధులు నిర్వర్తించారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి గాను 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగానూ పని చేశారు.

Also Read : TVK Chief Vijay: లాకప్‌ డెత్‌ మరణంపై టీవీకే చీఫ్ విజయ్‌ నిరసన

Leave A Reply

Your Email Id will not be published!