Prisoners: సబ్ జైలు నుండి పరారైన ముద్దాయిలను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

సబ్ జైలు నుండి పరారైన ముద్దాయిలను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

Prisoners : అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు సిబ్బందిపై దాడి చేసి… జైలు నుండి పారిపోయిన ఇద్దరు ముద్దాయిలను (Prisoners) విశాఖ నగర పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. విశాఖపట్నం సిటీ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు చోడవరం సబ్ జైలు నుండి తప్పించుకున్న నిందితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యల్లో భాగంగా… విశాఖపట్నం CTF ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నాలుగు CTF బృందాలు నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ లు, వారి నివాస స్థలాలు మరియు హోటల్ లు, హాస్టల్ లలో గత రాత్రి నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా SI భరత్ కుమార్, PC 3845 Sk బక్షి, PC 4128 జరార్ హుస్సేన్ ల బృందం… రాంనగర్, గొల్లలపాలెం ఏరియా లో వెతుకుచుండగా గొల్లలపాలెం SBI బ్యాంకు సమీపంలో సదరు అనకాపల్లి సబ్ జైలు నుండి తప్పించుకున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న S సంతోష్, PC 1073, APSP 16th బెటాలియన్ అనువారు ముద్దాయిలను పట్టుకోవడంలో CTF టీం కు సహకరించినారు.

Prisoners – శారదా నదిలోకి దూకిన యువతి

అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. శారదా నది వంతెనపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి శారదా నదిలో దూకడాన్ని గమనించిన వాహన దారుడు పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… శారదా నది వంతెనపై ఉన్న యువతి ఫోను, చెప్పులు ఆధారంగా మృతురాలు కీర్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో భారీ గణపతి ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి చెందిన నిర్వహుకుడు బుద్ధ భూలోక నాయుడు రెండవ కుమార్తె కీర్తిగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె కరూర్ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగిగా పని చేస్తుంది. అయితే యువతి బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read : Prisoners: చోడవరం సబ్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

Leave A Reply

Your Email Id will not be published!