Priya Prakash Varrier : పవర్ స్టార్ సింప్లీ సూపర్ – ప్రియా
ఆయనతో నటించడం అద్భుతం
Priya Prakash Varrier : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి ప్రియా ప్రకాష్ వారియర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , విలక్షణ నటుడు సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో ది వారియర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జూలై 28న విడుదల అవుతుందని ప్రకటించారు ధరమ్ తేజ్. ఆయన శాసిస్తాడు..తాను అనుసరిస్తానంటూ ట్యాగ్ లైన్ కూడా తగిలించాడు. దీంతో మరింత హైప్ ఈ మూవీపై.
Priya Prakash Varrier Said
ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. ఇక బ్రో(BRO) ది వారియర్ కు సంబంధించిన పోస్టర్స్ , టీజర్, సాంగ్ ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మేనరిజం మరింత అంచనాలు పెంచేలా చేశాయి.
ఇదిలా ఉండగా బ్రో మూవీలో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. తన జీవితంలో ఎన్నడూ ఊహించ లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటిస్తానని పేర్కొంది. ప్రత్యేకించి తనకు పిలిచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు సముద్రఖనికి రుణపడి ఉన్నానని తెలిపింది.
Also Read : Kanguva Movie : ‘సూర్య’ కంగువపై ఉత్కంఠ