Priyanka Gandhi : సుదర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. బీజేపీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే ప్రకటించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ.
తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో పవర్ పంచుకుంటోంది. ఇక రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో మాత్రమే అధికారంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో ఉంది. గోవాలో హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.
ఇక్కడ టీఎంసీ దెబ్బ కొట్టింది. పూర్తిగా పవర్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో పూర్తిగా పట్టు కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిన దెబ్బకు ఠారెత్తింది. ఇక దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గాల సంఖ్య ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi )ఆ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను తానే చేపట్టింది. ఏ పార్టీ చేయలేని హామీలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది.
ప్రజా సమస్యలను ఎత్తి చూపింది. అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తోంది. యూపీలో ఎలాంటి ప్రభావం చూపలేక పోయారు. భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించినా ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు.
యోగి నేతృత్వంలోని బీజేపీ రెండో సారి పవర్ లోకి వచ్చేలా దూసుకు పోతోంది. గత ఎన్నికల్లో 317 సీట్లను గెలుపొందిన బీజేపీ కొంత తగ్గింది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే సంఖ్యను స్పష్టం చేశాయి.
ఎన్ని హామీలు ఇచ్చినా కాంగ్రెస్ ను నమ్మక పోవడం విశేషం. అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించినా చివరకు గతంలో గెలిచిన సీట్లను కూడా చేరుకోలేని స్థితికి చేరుకుంది.
ఇక్కడ బీజేపీతో పాటు సమాజ్ వాది పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ సైతం బరిలో ఉన్నాయి.
Also Read : పంజాబ్ ను ఊడ్చేసిన ఆప్ చీపురు