Priyanka Chaturvedi : ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఎక్కడ – ప్రియాంక
గిరిరాజ్ సింగ్ పై ప్రియాంక సీరియస్
Priyanka Chaturvedi : కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ పై నిప్పులు చెరిగారు శివసేన పార్టీ చీఫ్ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi). బీహార్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు.
దీనిపై ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎంను ఎద్దేవా చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఎదుటి వాళ్లను, ప్రతిపక్షాలను ఎగతాళి చేయడం పరిపాటిగా మారిందన్నారు.
బీహార్ లో జాబ్స్ సరే మరి ఎన్నికల సందర్భంగా ప్రధాన మంత్రి ప్రతి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. శివసేన ఎంపీ 2014 ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన ఉద్యోగ వాగ్ధానాలను నెరవేర్చారా అంటూ ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాకమ్మ కథలు చెబుతున్న బీజేపీకి ఇతరులను ప్రశ్నించి, విమర్శించే హక్కు లేదన్నారు. ఉద్యోగాల కల్పనపై ఇప్పటి దాకా నోరు మెదపని ప్రధాన మంత్రి ని ఎందుకు నిలదీయడం లేదని పేర్కొన్నారు ప్రియాంక చతుర్వేది.
ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఉన్న ప్రభుత్వాలను కూల్చి వేసే పనిలో బిజీగా ఉన్న మోదీ , అమిత్ షా , బీజేపీకి ఇంత కంటే ఇంకేం చేయగలదని ఎద్దేవా చేశారు శివసేన ఎంపీ.
మీడియాకు కూడా సామాజిక బాధ్యత ఉందని నేను నమ్ముతాను. బీహార్ డిప్యూటీ సీఎంను కేంద్ర మంత్రి ప్రశ్నిస్తున్నారు సరే..మరి ప్రధాన మంత్రిని ఎందుకు నిల దీయడం లేదని వాపోయారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలలో కనీసం 10 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు ప్రియాంక చతుర్వేది.
Also Read : ఇండిపెండెన్స్ రోజు జాగ్రత్తలు పాటించాలి