Priyanka Gandhi : మోదీ ప్రభుత్వం దేశానికి శాపం
ప్రియాంక గాంధీ కామెంట్స్
Priyanka Gandhi : దేశంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం దేశానికి శాపంగా మారిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోమవారం మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా మోదీని ఏకి పారేశారు. ఆయన వల్ల దేశం వందేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు.
Priyanka Gandhi Slams Modi Govt
అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు , కార్మికుల రుణాలు మాఫీ చేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). కేవలం పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలు , కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు మాత్రమే మోదీ పని చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఓడ రేవులు, ఎయిర్ పోర్టులు , రైల్వే స్టేషన్లు అన్నీ ప్రైవేట్ పరం చేసే పనిలో పడ్డారంటూ మండిపడ్డారు ప్రియాంక గాంధీ. తాము బడులను ప్రారంభిస్తే మోదీ మాత్రం విద్యను, ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు ఆలోచించాలని , కాంగ్రెస్ పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
Also Read : Amit Shah : కమలం గెలుపు అభివృద్దికి మలుపు