Priyanka Gandhi : మోదీ పాలనలో రైతులు ఆగమాగం
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : రాజస్థాన్ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ నిర్వాకం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
Priyanka Gandhi Slams PM Modi
దేశమంతటా రైతులు నానా తంటాలు పడుతున్నారని కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. గత ఏడాది వ్యవసాయ చట్టాల కోసం రైతులు సమ్మె చేస్తుంటే బీజేపీ పార్టీకి చెందిన మంత్రి కుమారుడు కొందరు రైతులను చంపేశాడని ఆరోపించారు. కానీ ఇప్పటి వరకు వారిని పరామర్శించేందుకు వెళ్లలేదంటూ ప్రధానమంత్రిపై విరుచుకు పడ్డారు ప్రియాంక గాంధీ.
రైతులు తమ డిమాండ్ల కోసం నెలల తరబడి సమ్మెకు కూర్చున్నా ఇప్పటి వరకు వారి పట్ల కనీసం కనికరిం కూడా చూపలేదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రైతులు గుర్తుకు వస్తారని ఆ తర్వాత తాను మరిచి పోతారని మండిపడ్డారు. కేవలం బడా వ్యాపారవేత్తల కోసం పని చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు ప్రియాంక గాంధీ.
Also Read : Minister KTR : కాంగ్రెస్ ధోకా బీఆర్ఎస్ పక్కా