Priyanka Gandhi : మోసం బీజేపీ నైజం – ప్రియాంక గాంధీ
పవర్ లోకి రావడం ఖాయం
Priyanka Gandhi : ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం, వనరులను గంపగుత్తగా బడా బాబులకు కట్టబెట్టడం కేంద్రంలో కొలువు తీరిన మోదీకి అలవాటుగా మారిందంటూ సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఆదివారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంచలన ఆరోపణలు చేశారు. మోసం చేయడం భారతీయ జనతా పార్టీ నైజమని ఎద్దేవా చేశారు.
కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో మనుషుల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తోందంటూ మండిపడ్డారు ప్రియాంక గాంధీ. పేదరికం, నిరుద్యోగం తదితర ప్రధాన సమస్యలపై ప్రజలు దృష్టి పెట్టకుండా దారి మళ్లించే ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర్ లో బహిరంగ సభలో పాల్గొనేకంటే ముందు ప్రియాంకా గాంధీ మీడియాతో మాట్లాడారు.
ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ అవలంభిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అవినీతిని చట్ట బద్దం చేసిన ఘనత సీఎం బొమ్మైకి దక్కుతుందన్నారు. ప్రస్తుతం 40 శాతం కమీషన్ ప్రభుత్వమంటూ ప్రజలే చెబుతున్నారని, వారంతా ఈసారి మార్పు కోరుకుంటున్నారని చెప్పారు ప్రియాంక గాంధీ.
Also Read : ఆ నలుగురి స్పూర్తి ప్రశంసనీయం