Priyanka Gandhi Vadra: అమిత్‌ షాకు ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ !

అమిత్‌ షాకు ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ !

Priyanka Gandhi Vadra: ఎన్నికల్లో మాత్రమే గాంధీ కుటుంబ సభ్యులు అమేథి, రాయబరేలి నియోజకవర్గాల్లో పర్యటిస్తారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాకం గాంధీ వాద్రా ఘాటుగా విమర్శించారు. అమిత్ షా వాదన సత్యదూరమని ఆమె స్పష్టం చేసారు. తాను థాయ్‌లాండ్‌ లో పర్యటించిన సమాచారాన్ని అమిత్ షా ఎలా సేకరించారని ప్రశ్నించారు. హోం మంత్రి ఆరోపణల్లో నిజం ఏమాత్రం లేదని, మహిళల కార్యకలాపాలపై ఆయన నిఘా వేస్తుంటారని ఆరోపించారు. ”ముఖ్యంగా మహిళలతో సహా ఎవరు ఏం చేస్తు్న్నారు? ఎప్పుడు, ఎక్కడ ఉన్నారు? అనే దానిపై ఆయన దృష్టి సారిస్తుంటారు. నేను కొద్ది రోజుల క్రితం నా కుమార్తెను చూసేందుకు థాయ్‌లాండ్ వెళ్లాను. ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా ఈ ప్రస్తావన చేశారు. అవును…నేను థాయ్‌లాండ్ వెళ్లాను. అయితే ఈ సమాచారం ఆయనకు ఎవరు ఇచ్చారో చెప్పగలరా? ఆయన దగ్గర సమాచారం ఉన్ననప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన పనేంటి?” అని ప్రియాంక నిలదీశారు.

Priyanka Gandhi Vadra Slams

అమిత్ షా గత ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమేథీ, రాయబరేలి నియోజకవర్గాలను గతంలో అక్కడి నుంచి గెలిచిన గాంధీ ఫ్యామిలీ నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఆ నియోజకవర్గాల్లో గెలిచిన తర్వాత సోనియాగాంధీ, ఆమె కుటుంబం ఎన్నిసార్లు ప్రజలను చూసేందుకు వచ్చారు? అని ప్రశ్నించారు. సోనియాగాంధీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, రాహుల్, ప్రియాంక గాంధీ మాటేమిటని నిలదీశారు. గతంలో రాయబరేలి నియోజకవర్గంలో పలు దురదృష్టకర సంఘటనలు జరిగినా గాంధీ కుటుంబసభ్యులు వచ్చిన దాఖలాలు లేవన్నారు.

కాంగ్రెస్ హయాంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినట్టు ప్రియాంక(Priyanka Gandhi Vadra) తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గంగా బ్రిడ్జి, ఎయిమ్స్, నిఫ్ట్, ఎఫ్‌డీడీఐ, లక్నో నుంచి రాయబేరిలికి 4 లేన్ రింగ్ రోడ్డు, ఐదు నేషనల్ హైవేలు ఇచ్చిందన్నారు. మోటార్ డ్రైవింగ్ స్కూలు తాము ప్రారంభిస్తే వాళ్లు మూసేశారని చెప్పారు. స్పైస్ పార్క్, ఎయిమ్స్ ప్రారంభిస్తే దానిని కూడా వారు మూసివేయించారని చెప్పారు. 8 ఫ్లైఓవర్లు, కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంపీలాడ్స్ ద్వారా సాయం, రైల్వే వాషింగ్ లైన్, రైల్వేస్టేషన్ల మాడిఫికేషన్, 10 రైల్వే అండర్‌‌పాస్, కేంద్ర నిధులతో రాయబేరి నుంచి డల్‌మవు వరకూ రోడ్డు నిర్మాణం వంటివి తాము చేపట్టామని చెప్పారు. రాబయరేలికి బీజేపీ ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ, రాయబరేలిలో ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ సారథ్యం వహిస్తున్నారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న రాయబరేలిలో పోలింగ్ జరుగనుంది.

Also Read : Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య !

Leave A Reply

Your Email Id will not be published!