Priyanka Save : వైన్ వ్యాపారంలో ప్రియాంక హల్ చల్
హిల్ జిల్ వైనరీ బ్రాండ్ పాపులర్
Priyanka Save : ఎవరైనా మద్యం వ్యాపారం మహిళలు నిర్వహిస్తారంటే ఒప్పుకుంటామా. కానీ ప్రియాంక సేవ్ మాత్రం తన భర్తతో కలిసి వైన్ వ్యాపార రంగంలో మకుటం లేని మహారాణిగా వెలుగొందుతున్నారు. హిల్ జిల్ వైనరీ ని స్థాపించాచరు. మెరిసే ఆల్కహాలిక్ బెవరేజ్ బ్రాండ్ కు ఎనలేని డిమాండ్ నేటికీ ఉంది. దీనిని ఒక వ్యవస్థగా మార్చేసిన ఘనత ప్రియాంక సేవ్(Priyanka Save) కే దక్కుతుంది.
వ్యవస్థాపకత పట్ల కోరిక , స్థానిక పండ్లను అన్వేషించాలనే ఆసక్తి ఆమెను ఈ రంగం వైపు మళ్లేలా చేసింది. పండ్ల ఆధారిత పానియాల గురించి అంతగా తెలియని మార్కెట్ లోకి దూసుక పోయేలా చేసింది ప్రియాంక సేవ్ , నగేష్ పాయ్ దంపతులను.
నేల స్థాయి నుండి ప్రారంభమయ్యే ఫలవంతమైన ఆల్కహాలిక్ పానీయాల పరిశ్రమలో తమ ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రారంభించాయి. 2016లో వినూత్న ఆలోచనలు, పరిజ్ఞానంతో పూర్తి స్థాయి వైనరీని ప్రారంభించేలా చేసింది. సపోటా నుండి ఆల్కహాలిక్ పానియాలను ఉత్పత్తి చేయడంలో మొదటిది. సపోటా నుండి వైన్ తయారు చేయడం అన్నది ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం విశేషం.
మహారాష్ట్ర శివారు లోని బ్రహ్మంగావ్, బోర్డి కొండల కుగ్రామంలో ఉన్న బోటిక్ వైనరీలో రుచుల్ని చూసే ఛాన్స్ కూడా కల్పించారు. వీటితో పాటు పైనాపిల్ , స్ట్రాబెర్రీ , స్టార్ ప్రూట్ , చికూ , మామిడిలో ప్రూజాంటే మెరిసే ప్రూట్ వైన్ అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ ఆల్కహాలిక్ పానీయాల అత్యంత వైవిధ్యమైన , సమగ్రమైన శ్రేణులలో ఒకటిగా నిలిచింది. ప్రియాంక సేవ్(Priyanka Save) వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చారు. చికూ నుండి వైన్ తయారు చేయాలని ప్లాన్ చేశామని చెప్పింది.
Also Read : జీవితం నేర్పిన పాఠం దత్తా విజయం