Prof Kodandaram: స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరాం ఫైర్ !

స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరాం ఫైర్ !

Prof Kodandaram: ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం(Prof Kodandaram) మండిపడ్డారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం సరైంది కాదన్నారు.

‘దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారని స్మితా సబర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వాళ్లు సకాలంగుల కంటే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చట్టాలను అమలు చేయాల్సిన ఏఐఎస్‌ అధికారిణి వైకల్యాన్ని కించపర్చడం సమంజసం కాదు. స్మితా సబర్వాల్‌… తను చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకోకపోగా… సమర్థించుకోవడం శోచనీయం. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి’’అని కోదండరాం అన్నారు.

Prof Kodandaram – స్మితా సబర్వాల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి – వికాస్ శర్మ

దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని నమో దివ్యాంగ్‌ క్యాంపెయినింగ్‌ భారత్‌, డిసేబుల్డ్‌ హెల్ప్‌లైన్‌ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ వికాస్ శర్మ డిమాండ్‌ చేశారు. ఆమె చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు దివ్యాంగుల తరపున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్మిత ట్వీట్లు దివ్యాంగుల పట్ల ఆమె చులకనభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న స్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమా? లేదా ప్రభుత్వ అభిప్రాయమా? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : C.T. Kurien: ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్‌ కన్నుమూత !

Leave A Reply

Your Email Id will not be published!