Professor Limbadri : కొలువుల భర్తీలో నో కాంప్రమైజ్
వర్సిటీ కామన్ బోర్డు చైర్మన్ లింబాద్రి
Professor Limbadri : ఎలాంటి పైరవీలకు తావు లేకుండా కొలువుల్ని భర్తీ చేస్తామన్నారు వర్శిటీ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ లింబాద్రి(Professor Limbadri). ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు ఇంటర్వ్యూలను రద్దు చేసింది.
తాజాగా యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గతంలో ఆయా యూనివర్శిటీలే తమ అవసరాల మేరకు పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం ఉండేది.
కానీ సీన్ మారింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు కలిపి కామన్ బోర్డు ద్వారా ఒకే పరీక్ష చేపట్టి భర్తీ చేయనున్నారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ గా నియమితులైన ఫ్రొఫెసర్ లింబాద్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
పైరవీలకు తావు లేకుండా ఆయా యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు, నియామక ప్రక్రియ మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.
ఈ కామన్ భర్తీ బోర్డులో ఆర్థిక శాఖ, విద్యా శాఖ , కళాశాల విద్య కమిషనర్లు సభ్యులుగా ఉంటారని లింబాద్రి(Professor Limbadri) తెలిపారు. ఇక నుంచి అన్ని నియామకాలు ఈ బోర్డు ద్వారానే జరుగుతాయని వెల్లడించారు చైర్మన్. వెంటనే నోటిఫికేషన్లు ఇస్తాం.
షెడ్యూల్స్ ముందే డిక్లేర్ చేస్తాం. ఆ మేరకు భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామన్నారు. కాగా గతంలో లేని విధంగా ఒక అభ్యర్థి ఒకే దరఖాస్తుతో మొత్తం రాష్ట్రంలో ఉన్న 15 వర్సిటీలకు పోటీ పడవచ్చని తెలిపారు.
Also Read : పంతుళ్ల ప్రతాపం తలవంచిన ప్రభుత్వం