ADGP Pratapreddy : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కర్ణాటకలోని భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసుకు సంబంధించి పురోగతి సాధించినట్లు పోలీసులు తెలిపారు.
హర్ష హత్యతో శివమొగ్గ అంతటా హింస చెలరేగింది. జిల్లా అంతటా పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఇవాళ కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ రెడ్డి (ADGP Pratapreddy)హత్యకు సంబంధించి పురోగతి సాధించామని వెల్లడించారు.
ఆయన మీడయాతో మాట్లాడారు. ఈ హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని, హత్యకు పాల్పడిన వారిని గుర్తించామని స్పష్టం చేశారు ప్రతాప్ రెడ్డి. అరెస్ట్ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు.
దేశం యావత్తు కర్ణాటక వైపు చూస్తోంది. ఇప్పటికే హిజాబ్ వివాదం చోటు చేసుకోవడం, ఆ అంశం కర్ణాటక హైకోర్టులో కొనసాగుతోంది. ఈ తరుణంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష దారుణంగా హత్యకు గురి కావడం చర్చకు దారితీసింది.
ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి ప్రతాప్ రెడ్డి కేసు గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. హర్షను కత్తితో పొడిచి చంపిన ఘటనకు సంబంధించి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
నిందితులు ఎవరనేది పూర్తిగా క్లారిటీ వచ్చిందన్నారు. అరెస్ట్ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రతాప్ రెడ్డి(ADGP Pratapreddy) చెప్పారు. అయితే ఎవరెవరనే విషయం ఇప్పుడే వెల్లడించ లేమన్నారు.
ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇప్పటికే హింసకు పాల్పడిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లు కూడా నమోదు చేశామని తెలిపారు అడిషనల్ డీజీపీ.
Also Read : మిశ్రా బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్