Puja Khedkar: వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌ కు కేంద్రం బిగ్‌ షాక్‌ ! ఐఏఎస్‌ నుంచి తొలగింపు !

వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌ కు కేంద్రం బిగ్‌ షాక్‌ ! ఐఏఎస్‌ నుంచి తొలగింపు !

Puja Khedkar: మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ కు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఐఏఎస్‌ (ప్రొబేషన్‌) రూల్స్‌, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాయి. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైనింగ్‌ సమయంలో అధికారిక ఐఏఎస్‌ నెంబర్‌ ప్లేట్‌ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్‌ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా(Puja Khedkar) అక్రమాల చిట్టా బయటపడింది.

Puja Khedkar…

సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీనితో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ… ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

అయితే.. ఇటీవల కోర్టు విచారణ సమయంలో యూపీఎస్సీ చేసిన వాదనలను పూజా తోసిపుచ్చారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. ‘‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌(DoPT)కు మాత్రమే అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే వీలు ఉంది’’ అని వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను తొలగిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది.

Also Read : Congress : తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిదులు

Leave A Reply

Your Email Id will not be published!