Punjab: పంజాబ్ పేలుళ్ల నిందితుడ్ని అరెస్టు చేసిన అమెరికా పోలీసులు
పంజాబ్ పేలుళ్ల నిందితుడ్ని అరెస్టు చేసిన అమెరికా పోలీసులు
Punjab : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ అమెరికాలో పట్టుబడ్డాడు. పంజాబ్(Punjab) లోని 14 గ్రనేడ్ దాడులతో సంబంధం ఉన్న హ్యాపీ పాసియాను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. గత ఏడు నెలల్లో పంజాబ్ లో మొత్తం 16 గ్రనేడ్ దాడులు జరిగాయి. వీటిల్లో 14 ఘటనల్లో పాసియా హస్తం ఉంది. ముఖ్యంగా పోలీస్ పోస్టులు, ప్రార్థనా మందిరాలు, పేరున్న వ్యక్తుల ఇళ్ల పై, ఇటీవల బీజేపీ నేత మనోరంజన్ కాలియా గృహం పైనా దాడులు జరిగాయి. వీటిని దర్యాప్తు చేయగా హ్యాపీ పాసియా పేరు బయటకు వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌ఐఏ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకు చెందిన నలుగురిపై కేసులు పెట్టారు. ఈ జాబితాలో పాసియా పేరుతోపాటు… పాక్‌కు చెందిన హర్వీందర్ సింగ్ సంధు అలియాస్ రిండా కూడా ఉన్నారు.
Punjab Blasts Accused Arrested
‘‘ఈ దాడులకు రిండా, హ్యాపీ పాసియా రూపుకల్పన చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఈ దాడుల కోసం రోహన్ మిషా, విశాల్ మిషాలను నియమించుకొన్నారు. వీరే దాడులు నిర్వహించారు’’ అని ఎన్‌ఐఏ నాడు ఓ ప్రకటనలో పేర్కొంది. 2024లో ఛండీగఢ్ లో గ్రనేడ్ దాడికి సంబంధించి జనవరి 22న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో మొత్తం 16 చోట్ల ఈ సంస్థ తనిఖీలు నిర్వహించింది.
మాజీ పోలీస్ అధికారి జేఎస్ చాహల్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నిధులను సమకూర్చినట్లు పేర్కొంది.
Also Read : PM Narendra Modi: ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్