కొత్తగా పంజాబ్ (Punjab) లో కొలువు తీరిన ఆప్ (AAP) సర్కార్ 2022-23 కోసం మూడు నెలల పాటు ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. మద్యం వ్యాపారంలో స్థిరత్వం కొనసాగేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎంజీఆర్ కంటే 1.75 శాతం అదనపు రాబడిని ప్రస్తుత లైసెన్సు దారలుఉ ఇవ్వాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని గర్ఊపులు జోనల్ ఎంజీఆర్ ని మూడు నెలలకు గాను రూ. 1440. 96 కోట్లు గా అంచనా. ఇక స్వల్ప కాలిక ఎక్సైజ్ పాలసీ ఆదాయ లక్ష్యం ఈ కాలానికి రూ.1910 కోట్లు. ఇక సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ (Punjab) మంత్రివర్గం సమావేశమైంది.
ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 దాకా ఈ ఏడాదికి గాను ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. ఇది కేవలం మూడు నెలలకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది కేబినెట్.
కనీస ఆదాయం కంటే 1.75 అదనపు ఆదాయాన్ని ఇచ్చే ప్రస్తుత లైసెన్స్ దారులకు మూడు నెలల పాటు పాలసీ పునరుద్దరణకు పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది సర్కార్.
మద్యం వ్యాపారంలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు జోన్ , గ్రూప్ ల జోన్ల సంఖ్య , మద్యం విక్రయాల సంఖ్య అలాగే ఉంటుంది. మరింత రాబడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) .
అయితే పవర్ లోకి రాక ముందు మద్యాన్ని అరికడతామని చెప్పిన సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.
ఇదిలా ఉండగా జోన్ , రిటైల్ లైసెన్సీలు వారి అవసరానికి అనుగుణంగా మద్యం లిఫ్ట్ చేసేందుకు అదనపు స్థిర లైసెన్స్ ఫీజు మొత్తాన్ని పెంచినట్లు సమాచారం.