Punjab CM Bhagwant Mann : పంజాబ్ సీఎం యోగాలో లీనం

జూన్ 21న యోగా ఇంట‌ర్నేష‌న‌ల్ డే

Punjab CM Bhagwant Mann : ఎవ‌రిత‌ను అనుకుంటున్నారా. ఓ స్కూల్ టీచ‌ర్ కొడుకు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్ర‌స్తుతం పంజాబ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న భ‌గ‌వంత్ మాన్ . మ‌నోడు న‌టుడు, క‌మెడీయ‌న్, స్టేజీ యాక్ట‌ర్ వెర‌సీ ప్ర‌జ‌లు మెచ్చిన ముఖ్య‌మంత్రి. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన వివిధ పార్టీల‌కు చెందిన నేత‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. త‌క్కువ స‌మ‌యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్ లో కొలువు తీరేలా చేశాడు. సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన పంజాబ్ రాజ‌కీయంలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడు భ‌గ‌వంత్ మాన్.

మాన్ కొట్టిన దెబ్బ‌కు మోస్ట్ పాపుల‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్లు బొక్క బోర్లా ప‌డ్డారు. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ దూసుకు పోతున్నారు పంజాబ్ సీఎం. తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా యోగాను అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. యోగ శాల‌ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు భ‌గవంత్ మాన్(Bhagwant Mann). తాజాగా పంజాబ్ లోని జ‌లంధ‌ర్ లో ఏకంగా 15 వేల మంది పంజాబీల‌తో క‌లిసి యోగాను అభ్య‌సించాడు సీఎం. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌నే స్వ‌యంగా షేర్ చేశాడు.

యోగా అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం కావాలంటూ పిలుపునిచ్చాడు సీఎం . రాష్ట్రంలోని ప్ర‌తి మూల మూల‌న యోగాను అభ్య‌సించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు భ‌గ‌వంత్ మాన్.

Also Read : Nara Lokesh : విజ‌న్ లేని జ‌గ‌న్ తో ప‌రేషాన్ – లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!