Punjab CM vs Governor : గ‌వ‌ర్న‌ర్ లేఖ ‘మాన్’ క‌న్నెర్ర‌

పంజాబ్ సీఎం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్

Punjab CM Bhagwant Mann vs Governor : నిన్న‌టి దాకా ప్ర‌శాంతంగా ఉన్న పంజాబ్ ఇప్పుడు పంచాయ‌తీకి కేరాఫ్ గా మారింది. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో సీఎంలు, గ‌వ‌ర్న‌ర్ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఈ మొత్తం వ్య‌వ‌హారంపై భార‌త‌దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అస‌లు గ‌వ‌ర్న‌ర్ల‌కు పాలిటిక్స్ తో ప‌ని ఏమిటి అంటూ నిల‌దీశారు సీజేఐ చంద్ర‌చూడ్. తాజాగా పంజాబ్ లో ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ రాసిన లేఖ క‌ల‌క‌లం రేపుతోంది.

పంజాబ్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, సీఎం తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు గ‌వ‌ర్న‌ర్ పురోహిత్. దీనికి సంబంధించి అత్యంత ప‌దునైన ప‌దాల‌ను ఉప‌యోగించి సీఎం భ‌గ‌వంత్ మాన్ తిరిగి స‌మాధానం ఫిబ్ర‌వ‌రి 13న ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా త‌న‌కు రాసిన లేఖ‌లో అత్యంత అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో భాష వాడారంటూ గ‌వ‌ర్న‌ర్(Punjab CM Bhagwant Mann vs Governor) ఆరోపించ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

ఆయ‌న ఆవేద‌న కూడా చెందారు. ఇదిలా ఉండ‌గా పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీ లాల్ పురోహిత్ మార్చి 3న రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాన్ని పిల‌వాల‌ని సీఎం భ‌గ‌వంత్ మాన్ కు రాసిన లేఖ‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కాగా భ‌గ‌వంత్ మాన్ ఉప‌యోగించిన భాష రాజ్యాంగానికి విరుద్దంగా ఉంద‌ని ఆరోపించారు గ‌వ‌ర్న‌ర్. 14 రోజుల్లోపు స్పందించాల‌ని కోర‌డం ఆగ్ర‌హానికి తెప్పించింది. సీఎం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ ల మ‌ధ్య లేఖ యుద్దం కొన‌సాగింది.

ఇక రాసిన లేఖ‌లో తాను మూడు కోట్ల పంజాబ్ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే జ‌వాబుదారీగా ఉంటాన‌ని కేంద్రం నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్ కు కాదంటూ స్ప‌ష్టం చేశారు.

Also Read : జావేద్ అక్త‌ర్ కు సంజ‌య్ స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!