Punjab Farmers : పంజాబ్ రైతుల ఆందోళ‌న విర‌మ‌ణ

సీఎం భ‌గ‌వంత్ మాన్ తో భేటీ

Punjab Farmers : త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ గ‌త కొంత కాలంగా ఆందోళ‌న బాట ప‌ట్టిన పంజాబ్ రైతులు(Punjab Farmers)  ఎట్ట‌కేల‌కు విర‌మించారు. ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ తో గురువారం వారు స‌మావేశం అయ్యారు.

అనంత‌రం తాము చేప‌ట్టిన నిర‌స‌న‌ను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాము పండించిన గోధుమ‌ల‌పై బోన‌స్ తో పాటు వ‌చ్చే జూన్ 10 నుంచి వ‌రి నాట్లు ప్రారంభించ‌డంతో పాటు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని వారు కోరుతున్నారు.

ఈ మేర‌కు రైతు ప్ర‌తినిధులతో సీఎం చ‌ర్చించారు. వారి ఇబ్బందులు, స‌మ‌స్య‌ల గురించి సావ‌ధానంగా విన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన వాడినేన‌ని , వారి ఇబ్బందులు ఏమిటో త‌న‌కు తెలుస‌న్నారు సీఎం.

గ‌త కొంత కాలం నుంచి చండీగ‌ఢ్ – మొహాలీ స‌రిహ‌ద్దులో పంజాబ్ రైతులు ఆందోళ‌న చేప‌డుతూ వ‌చ్చారు. భ‌గ‌వంత్ మాన్ తో చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కావ‌డం, ఆయ‌న వారికి భ‌రోసా ఇవ్వ‌డంతో తాము ఆందోళ‌న విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రైతు నాయ‌కులు పంజాబ్(Punjab Farmers)  భ‌వ‌న్ లో భేటీ అయ్యారు. దాదాపు సీఎం , రైతు నాయ‌కుల మ‌ధ్య ఏకంగా రెండున్న‌ర గంట‌ల‌కు పైగా చ‌ర్చ‌లు కొన‌సాగాయి. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కి అనుబంధంగా ఉన్న రైతులు ఢిల్లీ త‌ర‌హా ఉద్య‌మానికి పిలుపునిచ్చారు.

త‌మ‌పై విధించిన విద్యుత్ భారాన్ని త‌గ్గించాల‌ని, భూగ‌ర్భ జ‌లాల‌ను సంర‌క్షించాల‌ని వారు కోరారు. ఈ మేర‌కు రైతులు కోరిన డిమాండ్ల‌న్నింటిని ఒప్పుకున్నారు సీఎం భ‌గవంత్ మాన్.

రైతుల‌ను అన్ని విధాలుగా త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

Also Read : రికార్డు స్థాయికి గోధుమ‌ల ధ‌ర‌లు

Leave A Reply

Your Email Id will not be published!