Purandeswari: పార్టీ సిద్ధాంతాలకు అంగీకరిస్తేనే వారిని స్వాగతిస్తాం : పురందేశ్వరి

పార్టీ సిద్ధాంతాలకు అంగీకరిస్తేనే వారిని స్వాగతిస్తాం : పురందేశ్వరి

Purandeswari: వైకాపా ఎంపీలు భాజపాలో చేరుతారు అనే విషయం తమకు సమాచారం లేదని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. గుంటూరులో నిర్వహించిన భాజపా కిసాన్‌ మోర్చా, ఎస్సీ మోర్చా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. కొల్లం గంగిరెడ్డి పార్టీలో చేరడంపై తాము నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నేతలను చేర్చుకునే అంశంలో అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వారు అంగీకరిస్తేనే చేర్చుకుంటామని చెప్పారు. వైకాపా నుంచి వచ్చే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల చేరికపైనా ఇదే విధానం పాటిస్తారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాపై ఇండియా కూటమి చేసిన దుష్ప్రచారం వల్లే 50-60 సీట్లు తగ్గాయన్నారు. దేశవ్యాప్తంగా భాజపాకు 18 కోట్ల మంది సభ్యులుంటే.. ఏపీలో 35లక్షల మంది ఉన్నారని వివరించారు.

Purandeswari Comment

సెప్టెంబర్ 2వ తేదీన సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని తెలిపారు. ప్రధాని మోదీ మొదటి సభ్యునిగా పేరు నమోదు చేసుకుంటారని.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదును పెంచేందుకు పార్టీ నేతలు కృషి చేయాలన్నారు. ఏపీలో నామినేటెడ్ పదవుల విషయంలో కూటమిలో చర్చలు జరుగుతున్నాయని పురందేశ్వరి(Purandeswari) తెలిపారు.

ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉందని చెప్పాం. రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తప్పుడు ప్రచారం చేశారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధికి భాజపా పెద్దపీట వేస్తోంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధే భాజపా ఆకాంక్ష. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం చెప్పింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని వైకాపా సరిగా చేపట్టలేదు. ఆ పార్టీ నిర్లక్ష్యం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సి ఉంటుంది. ఓటమిని జీర్ణించుకోలేకే వైకాపా నాయకుల తప్పుడు ప్రచారం అని పురందేశ్వరి తెలిపారు.

Also Read : Gautam Adani : ఆస్తుల పరంగా ముఖేష్ అంబానీ స్థానాన్ని దాటేసిన గౌతమ్ అదానీ

Leave A Reply

Your Email Id will not be published!