Purandeswari : సీజేఐకి పురందేశ్వరి లేఖ
విజయ సాయి రెడ్డిపై ఫైర్
Purandeswari : అమరావతి – ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ సర్కార్ ను ప్రత్యేకించి ఎంపీ విజయ సాయి రెడ్డిని టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు సుదీర్ఘ లేఖ రాయడం కలకలం రేపింది.
Purandeswari Letter to CJI
విజయ సాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని, గత 10 ఏళ్లుగా బెయిల్ మీద కొనసాగుతున్నారని ఆరోపించారు. ఆయన అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం బెయిల్ మీద కొనసాగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నేరారోపణలు ఉన్న వారు ఎలా పదవులలో కొనసాగుతారని, అందుకే వారిని వెంటనే తొలగించేలా తమరు ఆదేశించాలని కోరారు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari).
తనకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజల నుంచి వినతలు వస్తున్నాయని, తాము భయం భయంతో బతుకుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని విధాన పరమైన అంతరాలను అన్నింటిని పదే పదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై జగన్, విజయ సాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీజేఐనికోరారు పురందేశ్వరి.
Also Read : PM Modi Visit : తెలంగాణపై మోదీ ఫోకస్