Putin Zelensky : అత‌డి అంతం పుతిన్ ల‌క్ష్యం

టార్చ్ బేర‌రే అత‌డి టార్గెట్

Putin Zelensky : ర‌ష్యా ఆగ‌డం లేదు. ఎవ‌రు చెప్పినా విన‌డం లేదు. త‌న పంథా మార్చు కోవ‌డం లేదు. ఇదంతా ఉక్రెయిన్ విష‌యంలో తాను మాత్రం త‌గ్గ‌నంటోంది ర‌ష్యా. కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా దాడుల‌కు పాల్ప‌డుతోంది.

సామ‌న్య పౌరుల‌తో పాటు చిన్నారులు, మ‌హిళ‌ల్ని చంపుకుంటూ పోతోంది. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యులుగా మారారు. మిస్సైళ్ల‌తో దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ టైమ్స్ మ్యాగ‌జైన్ సంచ‌ల‌న క‌థ‌నం ప్రచురించింది.

ర‌ష్యా దేశాధ్య‌క్షుడు వ్లాదిమీర్ పుతిన్ ప్ర‌ధాన టార్గెట్ ఉక్రెయిన్ కాద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీని(Putin Zelensky )చంప‌డ‌మేన‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ క‌థ‌నం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది.

ఇప్ప‌టికే ప‌లుమార్లు దాడుల‌కు దిగుతూ వ‌చ్చింది. కానీ త‌ప్పించుకుంటూ వ‌చ్చాడు. సైనిక చ‌ర్య ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి ఈరోజు వ‌ర‌కు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు.

జెలెన్ స్కీని అంత మొందించేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా జెలెన్ స్కీ(Putin Zelensky )చేసిన హ‌త్యాయ‌త్నం విఫ‌ల‌మైంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఓ వైపు శాంతి చ‌ర్చ‌లు అంటూనే ఇంకో వైపు దాడుల‌కు పాల్ప‌డుతూ సాగుతోంది ర‌ష్యా. గ‌త వారం రోజుల్లోనే మూడు సార్లు చంపేందుకు ప్ర‌య‌త్నాలు సాగాయ‌ని కానీ వారి ఆట‌లు సాగ‌లేదు.

ఇదే విష‌యాన్ని యుద్దం స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి త‌న‌ను అంత‌మొందించ‌డ‌మే ల‌క్ష్యంగా పుతిన్ సాగుతున్నాడంటూ ఆరోపించాడు జెలెన్ స్కీ.

త‌న‌నే కాదు త‌న కుటుంబాన్ని కూడా అంత‌మొందించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడంటూ మండిప‌డ్డారు.

Also Read : విపక్షాలు దేశాన్ని దోచుకున్న జ‌ల‌గ‌లు

Leave A Reply

Your Email Id will not be published!