Putin Biden : భేటీ కానున్న పుతిన్..బైడన్

ఉక్రెయిన్..ర‌ష్యా మ‌ధ్య యుద్దం

Putin Biden : ఉక్రెయిన్..ర‌ష్యాల మ‌ధ్య యుద్ద బీభ‌త్సం కొన‌సాగుతోంది. ఆ ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసేందుకు మీటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ర‌ష్యా, అమెరికా అధ్య‌క్షులు పుతిన్, బైడెన్ లతో శిఖ‌రాగ్ర స‌మావేశం నిర్వ‌హించేందుకు రంగం సిద్ద‌మైంది. ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది ర‌ష్యా ప్ర‌భుత్వ యంత్రాంగం.

ఇందుకు సంబంధించి సూత్ర ప్రాయంగా ఇద్ద‌రూ ఒప్పుకున్నార‌ని ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ ఇవాళ వెల్ల‌డించింది. స‌మావేశం కావాలంటే ముందు మాస్కో సైన్యం ఉక్రెయిన్ పై దాడి చేయ‌డం మానుకోవాల‌ని అమెరికా పేర్కొంది.

ఈ ప్ర‌త్యేక స‌మావేంలో ఎలాంటి అజెండా లేద‌ని, కేవ‌లం యుద్దం, దాని విర‌మ‌ణ గురించి మాత్ర‌మే ఉంటుంద‌ని ర‌ష్యా పేర్కొనడం గ‌మ‌నార్హం.

ఒక వేళ ఎమ‌ర్జెన్సీ అనుకుంటే ర‌ష్యా, అమెరికా ప్రెసిడెంట్లు టెలిఫోన్ ద్వారా లేదా ఇత‌ర మాధ్య‌మాల ద్వారా స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అభిజ్ఞ‌వ‌ర్గాల స‌మాచారం.

ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది కూడా ర‌ష్యా ప్ర‌భుత్వం. ఇద్ద‌రు దేశాధినేత‌లు ఎంత త్వ‌ర‌గా మీట్ అవుతే బావుంటుంద‌ని యావ‌త్ ప్ర‌పంచం కోరుతోంది.

క్రెమ్లిన్ సెక్యూరిటీ మండ‌లి స‌మావేశానికి ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ (Putin Biden)అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. ఇందులో భాగంగా ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తో మాట్లాడ‌తారు.

అంద‌కంటే ముందు ఫ్రెంచ్ మంత్రితో మాట్లాడ‌నున్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్ చుట్టూ ర‌ష్యా ద‌ళాలు మోహ‌రించింది. ఇంకో వైపు దాడులు ముమ్మ‌రం చేసింది.

Also Read : త‌గ్గ‌క పోతే తాట తీస్తాం – బైడెన్

Leave A Reply

Your Email Id will not be published!