Teesta Setalvad : ప్రశ్నించడం నేరం కాదు – మేరీ లాలర్
తీస్తా సెతల్వాద్ అరెస్ట్ పై సీరియస్
Teesta Setalvad : 2002 నాటి గుజరాత్ అల్లర్లపై కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనాటి గుజరాత్ సీఎం, ఈనాటి ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు.
కేసు వేసిన ఐక్య రాజ్య సమితికి చెందిన కార్యకర్త తీస్తా సెతల్వాద్(Teesta Setalvad) ను గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముంబైలో అదుపులోకి తీసుకుంది.
దీనిపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణ ప్రత్యేక ప్రతినిధి మేరీ లాలర్ స్పందించారు. ఆమె అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తీస్తా సెతల్వాద్ పై మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్ల గురించి నిరాధారమైన సమాచారం ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వెంటనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం కలకల రేపింది. మానవ హక్కుల్ని పరిరక్షించడం నేరం కాదంటూ మేరీ లాలర్ ఈ సందర్భంగా అరెస్ట్ చేయడాన్ని ఉద్దేశించి మండిపడ్డారు.
ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు. ద్వేషం, వివక్షకు వ్యతిరేకంగా బలమైన గొంతుక తీస్తా సెతల్వాద్ అని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా న్యూస్ సర్వీస్ (ఏఎన్ఐ) ఎడిటర్ ఇన్ చీఫ్ అమిత్ షాతో చేసిన ఇంటర్వ్యూ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో నేను ఈ కేసుకు సంబంధించి తీర్పును క్షుణ్ణంగా చదివాను. తీర్పులతో తీస్తా సెతల్వాద్ పేరు స్పష్టంగా ఉందన్నారు.
ఆమె నడుపుతున్న స్వచ్చంధ సంస్థ పేరు తనకు గుర్తు లేదన్నారు అమిత్ షా. అల్లర్ల గురించి పోలీసులకు నిరాధారమైన సమాచారం ఇచ్చిందని ఆరోపించారు.
Also Read : సంగ్రూర్ ఉప ఎన్నికల్లో ఆప్ కు షాక్