Rafael Nadal : రాఫెల్ నాద‌ల్ అరుదైన ఘ‌న‌త

14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవ‌సం

Rafael Nadal : రాఫెల్ నాద‌ల్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. త‌న టెన్నిస్ కెరీర్ లో 14వ ఫ్రెంచ్ టైటిల్ ను సాధించి చ‌రిత్ర సృష్టించాడు. ఏకంగా త‌న ఖాతాలో ఈ టైటిల్ తో 22వ గ్రాండ్ స్లామ్ లు చేరాయి.

క్యాస్ప‌ర్ రూడ్ ను వ‌రుస సెట్ల‌లో ఓడించాడు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక టైటిళ్లు గెలుపొందిన టెన్నిస్ స్టార్ గా నిలిచాడు నాద‌ల్. 2005లో 19 ఏళ్ల వ‌య‌స్సులో త‌న మొద‌టి ఫ్రెంచ్ ఓపెన్ ని చేజిక్కించుకున్నాడు.

మ‌ళ్లీ ఇప్పుడు గెలిచాడు. ఇది 14వ టైటిల్ కావ‌డం విశేషం నాద‌ల్ కు. త‌న ఆట‌లో పాత ప్ర‌త్య‌ర్థులు నోవాక్ జొకోవిచ్ , రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ల కంటే రెండు టైటిళ్లు అత్య‌ధికంగా సాధించి ముందు వ‌రుస‌లో నిలిచాడు.

రాఫెల్ నాద‌ల్ 1972లో 34 ఏళ్ల ఆండ్రీ గిమెనో త‌ర్వాత పారిస్ లో గెలుపొందిన స్టార్ గా నిలిచాడు నాద‌ల్(Rafael Nadal) . అనుకోని రీతిలో రాఫెల్ నాద‌ల్ గాయం కార‌ణంగా కొంత కాలం ఆట‌కు దూరంగా ఉన్నాడు.

అత‌డిని దీర్ఘ కాలికంగా ఎడమ పాదం ఇబ్బందికి గురి చేసింది. కానీ అలుపెరుగ‌ని రీతిలో క‌ష్ట‌ప‌డ్డాడు. గోడ‌కు కొట్టిన బంతిలా తిరిగి త‌న కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ప్ర‌త్య‌ర్థులు విస్తు పోయేలా అద్భుత విజ‌యాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

త‌న కెరీర్ లో అత్య‌ధిక గ్రాండ్ స్లామ్ లు సాధించ‌డం అంటే మామూలు మాట‌లు కాదు. మొత్తం త‌న ఆట‌లో 112 విజ‌యాలు సాధిస్తే మూడు సార్లు మాత్ర‌మే ఓడి పోయాడు రాఫెల్ నాద‌ల్(Rafael Nadal).

Also Read : ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత నాద‌ల్

Leave A Reply

Your Email Id will not be published!