Raghav Chadha : అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా రాఘవ్ చద్దా
నియమించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Raghav Chadha : పంజాబ్ ఆప్ రాష్ట్ర ఇన్ చార్జ్, ఎంపీ రాఘవ్ చద్దాకు(Raghav Chadha) పదోన్నతి లభించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాలలో కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర సలహా కమటీ చైర్మన్ గా నియమించారు. కాగా మాన్ సర్కార్ ఢిల్లీ నుంచి రిమొట్ కంట్రోల్ ద్వారా నడుస్తోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షాల నాయకులు విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా రాఘవ్ చద్దా పంజాబ్ ప్రభుత్వానికి ఆర్థిక విషయాలతో పాటు ఇతర కీలక రంగాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వ ప్రజానుకూల కార్యక్రమాలు, వాటి అమలుపై పర్యవేక్షిస్తారని ఇందులో పేర్కొన్నారు సీఎం. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉండగా రాఘవ్ చద్దాను నియమించడం వల్ల తమ సర్కార్ కు మరింత తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు సీఎం భగవంత్ మాన్. వృత్తి రీత్యా రాఘవ్ చద్దా చార్టర్డ్ అకౌంటెంట్.
ప్రపంచంలోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థలతో కలిసి పని చేశారు. గతంలో ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియాకు కూడా రాఘవ్ చద్దా ఆర్థిక సలహాదారుడిగా సేవలు అందించారు.
ఢిల్లీని రెవిన్యూ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు, తద్వారా అధిక ఆర్థిక వృద్ధి సాధించేందుకు చద్దా కృషి దోహద పడిందని తెలిపారు.
కాగా రాఘవ్ చద్దాది పంజాబ్ లోని జలంధర్. ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చింది ఆయన కుటుంబం. ఢిల్లీలో పంజాబ్ అకాడమీని పునరుద్దరించడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : అన్నాడీఎంకేకు ఈపీఎస్ బాస్