Raghu Rama Krishna Raju: మాజీ సీఐడీ చీఫ్ పై గుంటూరు ఎస్పీకి రఘరామకృష్ణంరాజు ఫిర్యాదు !

మాజీ సీఐడీ చీఫ్ పై గుంటూరు ఎస్పీకి రఘరామకృష్ణంరాజు ఫిర్యాదు !

Raghu Rama Krishna Raju: వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌ పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌, ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయ్‌ పాల్‌ బాధ్యులని తెలిపారు. అలాగే, తన గాయాలపై గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్‌ కుమార్‌ బెదిరించారని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

Raghu Rama Krishna Raju Case

అయితే రఘరామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) ఫిర్యాదుపై పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సర్వత్రా ఆశక్తి నెలకొంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ తరపున గెలుపొందిన రఘరామకృష్ణరాజు… పార్టీ అధికారంలోనికి వచ్చిన కొన్ని నెలలకే అధిష్టానంతో విభేదించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై బహిరంగంగా వ్యాఖ్యానించేవారు. దీనితో రఘరామకృష్ణరాజు వెర్సస్ వైసీపీ ప్రభుత్వం అనేలా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రఘరామకృష్ణరాజుపై వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. అంతేకాకుండా కస్టోడియల్ టార్చర్ చేసారు. ఇదే విషయంపై రఘరామకృష్ణరాజు సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు.

Also Read : Kesineni Nani: రాజకీయాలకు గుడ్‌ బై చెప్పిన కేశినేని నాని ! నానిపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!