Raghuram Rajan : ద్రవ్యోల్బణం తగ్గించేందుకే వడ్డీ రేట్లు పెంపు
రఘురామ్ రాజన్ షాకింగ్ కామెంట్స్
Raghuram Rajan : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం నెలకొందని ఇదే సమయంలో భారత దేశంలో ఆర్బీఐ దానిని తగ్గించేందుకే వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందని అభిప్రాయ పడ్డారు.
శ్రీలంక, పాకిస్తాన్ దేశాలలో నెలకొన్న సంక్షోభం ఇక్కడ ఉండదన్నారు. అక్కడ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగినంత, ఆశించినంత మేర లేవన్నారు.
కానీ భారత్ లో అందుకు తగినంత మేర ఉండడం వల్ల ఇప్పట్లో సంక్షోభం వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు రఘురామ్ రాజన్. కాగా భారత్ కు సంబంధించి విదేశీ అప్పులు తక్కువగా ఉండడం కూడా కొంత మేరకు ఇబ్బందులు పడకుండా చేసిందన్నారు.
కానీ ఇలాగే ఉపేక్షిస్తే మాత్రం భారత దేశానికి కష్టాలు తప్పవన్నారు. ప్రస్తుతం దేశాన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర సమస్యలుగా పీడిస్తున్నాయని చెప్పారు.
అయితే ఉదారవాద ప్రజాస్వామిక విధానం ప్రస్తుతం దేశానికి అవసరమని స్పష్టం చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టిందన్నారు.
ఈ విషయంలో భారత్ కు ఢోకా లేదన్నారు రఘురామ్ రాజన్(Raghuram Rajan). దేశం సంక్షోభానికి గురి కాకుండా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు.
ఇక ఆర్బీఐ తాజాగా విదేశీ మారక నిల్వలకు సంబంధించి వివరాలు వెల్లడించింది. జూలై 22 నాటికి 571.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విదేశీ రుణం $620.7 బిలియన్లకు చేరుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఆర్బీఐ మాజీ గవర్నర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : తమిళ నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్లపై ఐటీ దాడులు