#RahuKetu : రాహు కేతు గ్రహాలు వృషభ వృశ్చిక రాశుల్లో ప్రయాణం,  ద్వాదశ రాసులవారి ఫలితములు

Rahu Ketu: ఈ శార్వరి నామ సంవత్సరం లో 23 సెప్టెంబర్ నుండీ ఆరంభ‌మైన‌ రాహు కేతు గ్రహ రాశి మార్పు , ఇక్కడ రాహు మిథునం నుండీ వృషభ రాశి లోకి మృగశిర 2 వ పాదం లోకి, కేతువు ధనుస్సు నుండీ వృశ్చిక రాశిలోకి జ్యేష్ట 4 వ పాదం లోకి ప్రవేశం.

Rahu Ketu: ఈ  శార్వరి  నామ సంవత్సరం లో  23 సెప్టెంబర్  నుండీ  ఆరంభ‌మైన‌ రాహు  కేతు గ్రహ రాశి మార్పు , ఇక్కడ రాహు  మిథునం  నుండీ  వృషభ రాశి  లోకి  మృగశిర  2 వ పాదం లోకి, కేతువు  ధనుస్సు  నుండీ వృశ్చిక రాశిలోకి  జ్యేష్ట 4 వ పాదం  లోకి ప్రవేశం. దాదాపు  18 నెలలు  పాటు  ఆ  రాసుల్లో( సుమారు 2022 ఏప్రిల్ 22)  ఉండటం  జరుగుతుంది.
ఈ నేపథ్యం  లో  వృషభరాశి  ప్రవేశ  రాహు, వృశ్చిక  రాశి  ప్రవేశ  కేతు  గ్రహ(Rahu Ketu)  ఫలితాలను చూస్తే చంచల స్వభావం స్థానచలన కారకుడు స్వభావరీత్యా చెయ్యవలసిన చెడు చెయ్యకుండా ఉండాలంటే స్థిర రాశులలో ఉండటమే మంచిది . ఆశకు అధిపతి . సాధారణంగా ఆశ అనేది ఒకటి ఆశించటం అది సిద్ధించే లోపల ఇంకోటి ఆశించటం,  ఈ స్థిరరాశి  లోకి మార్పు వలనఆశించినది అందే లోపల మరోదానిపై ధ్యాస  కాకుండా  ఆశించినదానిపై ఆలోచన  నిలకడగా ఉండటం  జరుగుతుంది. స్థిరరాశి లో ఉండటం వలన ఆ కోరిక పై మనస్సు లగ్నం గా ఉంటుంది అది సాధించేదాకా నిద్రపోరు, చర ద్విస్వభావ రాసుల కన్నా  స్థిర  రాశుల్లో రాహువు  ఎక్కువ రాణించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆశకు శుక్రుడు,  అయితే ఆశయానికి గురుడు అధిపతులుగా అనుకున్నట్లయితే, రాహువు లక్షణం ఎవరి రాశిలో ఉంటే వారి ఫలితాలు ఇస్తాడు కనుక శుక్రుడు రాశి అయిన వృషభ రాశి లోకి రావడం వలన( వృషభ రాశి స్థిర రాశి కావడం వలన) ఆశ విషయంలో  శుక్రునితో స్వభావ సారూప్యం ఉంటుంది  ఉంటుంది అందువల్ల తన స్వభావానికి అనుకూలమైన మిత్రుడైన శుక్రుని రాశిలో అభివృద్ధికారకుడు. మిథునములో కన్నా .  దానివల్ల వ్యక్తులలో స్థిరమైన  ప్రయత్నాలు కొనసాగి  అభివృద్ధికి అవకాశాలు కలుగుతాయి.
ఇక కేతువు వృశ్చిక రాశి లోకి రావటం చేత వైరాగ్యాన్ని ప్రదర్శించకుండా ఉండే  లక్షణం ఉంటుంది. అలా ప్రదర్శిస్తే సమాజానికి దూరం అవుతారు, ఆ ప్రదర్శన లక్షణాన్ని ఇష్టపడని వారు దూరం పెట్టె అవకాశాలున్నాయి. సాధారణం గా వృశ్చికం నిగూఢముగా ఉండే రాశి కనుక  వీరు కూడా  మనసులోని భావాన్ని మనసులో దాచుకొని మెలుగుటవల్ల  సమాజానికి మేలు చేసే స్థితి. కుజావత్ కేతు అన్నట్లు  కుజ కేతు ఇరువురిస్వభావాలు  దగ్గరగా ఉండుట వల్ల కుజ రాశి లోకి కేతువు చేరుట  మేలు.
గమనిక.. ఇక్కడ  కింద  12 రాసులవారికి  మేషం  నుండీ  మీనం  వరకూ  ( చంద్ర రాశి అనగా  వారి  నక్షత్ర రీత్యా ఏర్పడు  రాశి ) రాహు, కేతు  ప్రవేశం  వలన  వివిధ  రాసుల్లో  ప్రభావం చెప్పటం  గోచార రీత్యా జరిగినది. ఐతే  వ్యక్తిపై  సంపూర్ణ ఫలమునకు పూర్తి జాతకం, నడిచే దశ  అంతర్దశలు,జన్మకాల  గ్రహస్థితి  ప్రస్తుత  దశ,తో కలిపి గోచార రీత్యా  ఫలములు, రెమెడీస్  చూసుకొనుట ఉత్తమం, కేవలం గోచార  ఫలితాలను  చూసి  అందులో  మంచి చెడ్డలను  అన్వయించుకొనుట  పూర్తి ఫలం కాదు. మన జన్మ జాతకం లో నడిచే దశ, అంతర్దశలు  బలం గా ఉంటె  గోచార గ్రహ ప్రభావం లో  ఉండే స్వల్ప దోషాలకి కంగారుపడనవసరంలేదని గమనించాలి.
1)మేష రాశి ఫలితములు …
రాహువుద్వితీయ స్థానములో ప్రవేశించినప్పుడు  మాటల వల్ల  అపార్థములు, తక్కువ మాటాడి  ఎక్కువ వినాలి , అవవసర ధన వ్యయములు వ్యక్తిని ఆర్థిక ఇబ్బందులకు,  కుటుంబము లో  వ్యక్తులతో  కలతలు, సభ్యుల మధ్య వివాదములు తలెత్తుతాయి.  కొత్త  వ్యక్తుల జోక్యం కోపం కలిగిస్తుంది.పంటి, కంటి  సమస్యలు కొంత చికాకు తెస్తాయి. కేతుఅష్టమస్థాన  ప్రవేశం వలన  ఆరోగ్యముపై  శ్రద్ధ  తగ్గుతుంది, ఇదివరలో  ఉన్న  అనారోగ్యాలు  పెరిగే  అవకాశం, కనుక  ఆరోగ్యము అశ్రద్ధ చేయరాదు
*శ్రీ గణేశ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా, అనుశ్లోకాన్ని ప్రతి  నిత్యంగంటపఠించుట మేలు .
2)వృషభ రాశి ఫలితములు
రాహువు  రాశి ఉన్న స్థానములో ప్రవేశించినప్పుడు  సెంటర్ అఫ్ అట్రాక్షన్  కావాలనుకుంటారు. నాయకత్వ లక్షణాలు  విప్లవాత్మక ధోరణి పెరుగుతాయి. పెత్తనం చెలాయిస్తుంటారు  సంఘం లో. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఉన్నందు వలన కొంత మానసిక వ్యాకులత కలుగును. శారీరక అలసట కలిగినప్పటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కేతువు  సప్తమ స్థాన ప్రవేశంతో  కుటుంబములో, వృత్తిలో  భాగస్వాముల నడుమ  చికాకులు, అభిప్రాయం భేదములు, దూరప్రాంత అవకాశాలను ఇష్టపడకపోవటం వైరాగ్య ధోరణి.
3)మిథునరాశి ఫలితములు
రాహువు ద్వాదశ స్థాన ప్రవేశము అనవసరమైన వృధా ఖర్చులను, రుణములను,  పగటి కలలు,గాలిమేడలు కట్టడం, వ్యర్ధఊహాగానాలు, సమయం వృధాకలగ చేస్తుంది.అనవసర వ్యక్తులతో  స్నేహాలు, దుర అలవాట్లు నియంత్రణ అవసరం.మంచివారితో  సాంగత్యం  ఉత్తమం. కేతువు షష్ఠ స్థాన ప్రవేశముతో రోగనిరోధకశక్తి  తగ్గటం, ఋణములు  తీర్చుటలో అసంతృప్తి, కొత్త ఋణములు అందుట కష్టం, శత్రువుల, ప్రత్యర్థుల  విజయము, విద్యార్థులకు పోటీలపై వైరాగ్య ధోరణి. పోటీలులేని చదువులకు వెళ్ళుట ఉత్తమం. పనులలో ఆలస్యాలు.
 4)కర్కాటకరాశి ఫలితములు రాహువు ఏకాదశ  స్థాన ప్రవేశము
 గౌరవము, కీర్తి, ప్రతిష్ఠ వంటిశుభ ఫలితాలు. పూర్వఆదాయముతో కొత్త విధానములోకూడా ఆదాయము తో ఆర్థికంగా పరిస్థితి అభివృద్ధి, కృషిశీలత పట్టుదల  కలుగుతుంది.చాలాకాలం గా రావలసినలాభములు అందుకుంటారు వాటిని  పెంచటానికి చేసే ప్రయత్నాల్లో మోసాలకు లోనుకాకుండా ఉండాలి
కానీ కేతువు  పంచమ స్థాన ప్రవేశం వలన  ఉపాసనపై  ఆధ్యాత్మిక  చింతనపై  ద్రుష్టి  మరల్చి  లౌకిక  అంశాలకి  ప్రాధాన్యత  ఇవ్వటం తగ్గిస్తే  అభివృద్ధి కరం, మానసికం గా  చికాకులు, సంతాన అంశాలలో అసంతృప్తి, శ్రద్ధ తగ్గుతాయి.
5)సింహరాశి ఫలితములుఈ రాహువు దశమ స్థాన ప్రవేశము
స్థానచలనముకు, ఉద్యోగ బదిలీలకుఅవకాశములు .నూతన వృత్తికి, కొత్త బాధ్యతలకు సమయం. ఆర్థికపరమైన ఇబ్బందులు నష్టముకలగ వచ్చు. అనవసర అధిక  శ్రమ తత్ఫలితముగా అలసట కలగ వచ్చు.కేతువు చతుర్ధస్థాన ప్రవేశం వలన  గృహ, విద్య  మాతృ  సంబంధ అంశాలలో అసంతృప్తి వైరాగ్యం , వేళకి ఆహార సక్రమం గా తీసుకోలేక పోవటం, విద్యార్ధులకి జ్ఞాపకశక్తి లోపం, ప్రయాణములలో ఆటంకాలు, ఖర్చులు. శ్రీ గణేశాయన మహా  మంత్రం నిత్యం  గంట పఠించుట, మేలు
6)కన్యారాశి ఫలితములు  రాహువు నవమ స్థాన ప్రవేశము
దూర ప్రదేశములలో విద్య  ఉద్యోగ  అవకాశములు,విదేశీ ప్రయత్నాలు, తలపెట్టిన కార్యక్రమాలు అన్నింటా ఆటంకములను కలిగించ వచ్చు. పనులు పూర్తికానున్న సమయంలో  కొత్త ఇబ్బందులుఅనవసర ఖర్చుల వలన ఆర్థికపరమైన చిక్కులు కేతువు తృతీయ స్థాన ప్రవేశం వలన  ప్రయాణాలపై ఆసక్తి తగ్గుతుంది, ఇతరులతో  సహాయ సహకారాలపై  అసలు  ద్రుష్టి  ఇష్టం  ఉండవ్, లౌకిక  అంశాలపై శ్రద్ధ ఉండదు. దగ్గర వారితో అభిప్రాయాలూ కలవవు. ఎక్కువ దూరం గా ఉండటానికి ప్రాధాన్యత
7)తులారాశి ఫలితములు రాహువు అష్టమ స్థానప్రవేశము
ఆకస్మిక అవమానాలు, అధిక అనవసర వ్యయం, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పలువిధ సమస్యలు  చికాకు . మూత్ర సంబంధిత వ్యాదులతో బాధపద వచ్చు. ఆర్థికసమస్యలను, నష్టము   అనవసర ఖర్చులు లోనుకాకుండా దుర్గాజపములు, మంచిది కేతువు  ద్వితీయ స్థాన ప్రవేశం వలన ఆర్ధిక అంశాలలో,సంపాదనపై  అభివృద్ధి ఆసక్తి  తక్కువ .కుటుంబంలో కొత్త వ్యక్తుల జోక్యం,ఖర్చులు ఆరోగ్యపరమైన చిరాకులు. మాటల్లో వైరాగ్యం, తక్కువ మాట్లాడి ఎక్కువ అర్ధం చేసుకోటం మంచిది. వీలైనంత మౌనం గా ఉంటారు . కేతువుకి ఉలవలు దానం, జపాలు మేలు
8)వృశ్చిక రాశి ఫలితములు  రాహువు సప్తమభావ ప్రవేశము
భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితములో,కళత్ర తరపు వారితో,  వృత్తిపరమైన  భాగస్వాముల  నడుమ  అపోహలకు అపార్దాలకు   కలతలు తో  దూరము పెరగకుండా చూసుకోవాలి, భాగస్వామికి ఆరోగ్య పరమైన  కష్టములు కలుగుఅవకాశములు.  కేతువు  రాశి లో  ప్రవేశిస్తే, వ్యక్తిగత శ్రద్ధ ఆసక్తి  తగ్గి  యోగ  ప్రాణాయామ  మెడిటేషన్  వంటివాటిపై  ఇష్టం,కొత్త  వ్యక్తులతో  కలవటం  స్నేహసంబంధాలపై  ఆసక్తి  ఉండవ్, ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టం తక్కువ. వారి ప్రపంచం విభిన్నం.ఉపవాసములు చేస్తూవుంటారు. భగవంతుని సన్నిధి గడుపుతారు .
 9)ధనుస్సు రాశి ఫలితములు రాహువు షష్టమ స్థాన ప్రవేశము
ఆటల్లో, వివిధ పోటీలలో నెగ్గుతారు, కృషిశీలత పెరుగుతుంది  ఋణములు  తీరుస్తారు, శత్రువులపై పట్టు సాధిస్తారు. రోగనిరోధకశక్తి పెరిగినా ఆరోగ్యము మిద ప్రభావముకొంత ఉండేందుకు అవకాశం  కనుక ఆహార  పానీయాలను తీసుకునే విషయములో శ్రద్ధవహించ వలసి ఉంది.ఆర్థిక పరిస్థితి లో ఆకస్మిక ధనలాభము వస్తుంది.కేతువు ద్వాదశ స్థాన  ప్రవేశం  వలన  తీర్ధయాత్రలు, గురుజీలు, బాబాల ను కలవటానికి  ఆశీస్సులు  తీసుకుటానికి, క్షేత్రాలు  సందర్శనకు, నదీస్నానములకు, విరాళములు ఇవ్వటానికి, ఆధ్యాత్మిక చింతనకి ప్రవచన శ్రావణములకు ప్రాధాన్యము
10)మకరరాశి ఫలితములు రాహువు పంచమస్థాన ప్రవేశము
ప్రేమ వివాహములకు ప్రయత్నాలు, పందేలు రేసులకి  ఖర్చులు, ధనసంపాదనకి ఆశతో  కలలు కంటూ ధనము కావలన్న తపనలో ఉన్న ధనమును కూడా  వ్యయము చేయకుండా చాల  జాగర్తపడాలి. నూతన స్నేహసంబంధాలు పెరుగుట,ఆలోచన విధానం సరిచేసుకోవాలి.   కేతువు ఏకాదశ స్థాన ప్రవేశము చేత  దూరప్రాంత మిత్రులు అన్యమతస్తుల సహకారం  విదేశీ  ఆహ్వానాలు  అవకాశములు  విరాళాలు  ట్రస్టుల ద్వారా  లభ్యము  కానీ  అంతగా  ఆసక్తి  చూపరు. చిన్ననాటి  మిత్రులు  కలయిక, సంతానమునకు వారి సహకారం.
11)కుంభరాశి  ఫలితములు రాహువు చతుర్ధ స్థాన ప్రవేశము
ఆకస్మిక  సమస్యలను ఇబ్బందులను  కలిగించును. తల్లికిసంబంధిత కష్టములతో భూమి వాహనము సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి నూతన  వాహనాలు నిర్మాణాలు అననుకూలం అని గ్రహించాలి. విద్యార్ధులకి విద్య పై శ్రద్ధ ఆసక్తి  తగ్గుతుంది.కేతువులు  దశమస్థాన ప్రవేశం  వలన  వృత్తిలో  అభివృద్ధి  ఆశించినమేరకు  ఉండుట  కష్టం, ఆర్ధికంగా చిరాకు వ్యయం, దూరప్రాంత  అవకాశాలు  ఉన్నా  వినియోగించుకోటంపై  అశ్రద్ధ. అధికారులతో పేచీలు. ఉన్న వృత్తినుండి  తప్పుకునే ఆలోచనలురాహు, కేతువుల  సంబంధిత  దానములు  మినుములు  ఉలవలు,  శ్లోకాలూ, జపం చేసుకోటం మంచిది
12) మీన రాశి ఫలితములు  రాహువు తృతీయ స్థాన ప్రవేశము
కొంత  శుభఫలితాలను ఇచ్చిన,  మిత్రులు  లేదా  సన్నిహిత వ్యక్తులు తో చేరి వారి సహకారం అధికంగా ఆశించి  తర్వాత  అసంతృప్తికి  లోనవుతారు, ఆశించినంత  అందివ్వని వ్యక్తులు  దూరం అవుతారు. తెలివి  ఉపయోగించి కార్యములు చక్కబెట్టుటకు ప్రయత్నము చేస్తారు.దగ్గర ప్రయాణాల్లో మోసాలకు అవకాశాలు.నూతన స్నేహాల విషయంలో తగుజాగర్తలు మంచిది కేతువు   నవమ స్థాన  ప్రవేశం  వలన  దూరప్రయాణాలకి  ఆటంకములు  అనాసక్తి, దూర  విద్యలు, దూరప్రాంత వృత్తులపై అసంతృప్తి . పెద్దలు  గురువుల  సందర్శన, ఆశీస్సులు. ఆధ్యాత్మిక అంశాలలో ఆసక్తి ఉన్నా  ఆటంకాలు. పుణ్యబలం పెంచుకొనే కృషి చేయాలి
జ్యోతిష మహోపాధ్యాయ, వాస్తు సిద్ధాంత శిరోమణి 
డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి

No comment allowed please