Rahul Gandhi : దేశం బాగుండాలని పూజిస్తున్నా – రాహుల్
ఉజ్జెయిని మహాకాళ ఆలయంలో పూజలు
Rahul Gandhi : భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయం చేసేందుకు మతాన్ని, దేవుళ్లను పూజిస్తుంది. కానీ తాను ప్రజల కోసం, దేశ శ్రేయస్సు కోసం తపస్సు చేస్తున్నానని, అందుకే భారత్ జోడో యాత్ర చేపట్టానని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
ఆయన ధోతి, ఎరుపు రంగు వస్త్రం, రుద్రాక్షతో ఉజ్జెయిని లోని మహాకాళ ఆలయంలో పూజలు చేశారు. జైన మత గురువు ప్రజ్ఞా సాగర్ మహారాజ్ ఆశీస్సులు కూడా అందుకున్నారు.
రాహుల్ గాంధీ వెంట పార్టీకి చెందిన నేతలు కమల్ నాథ్ , జితు పట్వారీ ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆయన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తి చేశారు యాత్రను.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మధ్యప్రదేశ్ లో. పూజలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. ఇది తపస్సులు (సన్యాసులు) పూజింప బడే దేశం. నేను గత మూడు నెలలుగా తపస్సు చేస్తున్నాను.
ఈ దేశం బాగుండాలని, కార్మికులు, రైతులు ఆనందంగా ఉండాలని, వారికి గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
జీవితం చాలా చిన్నది అందుకే దేశానికి ద్వేషం ఉండ కూడదని ప్రేమ కావాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. అసలు సన్యాసులు ఎవరంటే కరోనో కష్ట కాలంలో పని చేసిన వారేనని కితాము ఇచ్చారు.
Also Read : నన్ను తిట్టక పోతే పొద్దు గడవదు – రాహుల్