Rahul Arvind Kejriwal : ఉగ్ర మూకల ఘాతుకం దారుణం
రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ సంతాపం
Rahul Arvind Kejriwal : జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి పూంచ్ లో ఆర్మీ ప్రయాణం చేస్తున్న వాహనంపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘనలో భారత దేశానికి చెందిన జవాన్లు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సీరియస్ గా స్పందించారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఈ ఘటన తమను ఎంతగానో ఆవేదన పడేలా చేసిందన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. పూంచ్ జిల్లా లోని మెంధార్ లో ఉగ్ర దాడి తర్వాత మంటల్లో ఆర్మీ వాహనం పూర్తిగా కాలి పోయింది. విషయం తెలిసిన వెంటనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన జవాన్లకు నివాళులు అర్పించారు.
జవాన్లు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul). ఈ పిరికి దాడికి పాల్పడిన వారి వెనుక ఎవురు ఉన్నారనేది కేంద్రం తేల్చాలని డిమాండ్ చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ , జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. పూంచ్ లో జరిగిన దాడి దారుణమని పేర్కొన్నారు. ఇది ఆమోద యోగ్యం కాదన్నారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు కాంగ్రస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.
Also Read : ఉగ్రవాదుల దాడిలో జవాన్లు మృతి