Rahul Gandhi Visits : ర‌ఘునాథ్ ఆల‌యంలో రాహుల్ గాంధీ

పూజ‌లు చేసిన అగ్ర నాయ‌కుడు

Rahul Gandhi Visits : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జ‌మ్మూ , కాశ్మీర్ లో కొన‌సాగుతోంది. సోమ‌వారం ఉద‌యం రాహుల్ తిరిగి త‌న యాత్ర‌లో భాగంగా జ‌మ్మూలో అత్యంత ప్ర‌సిద్ధి చెందిన ర‌ఘునాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. పూజ‌లు చేశారు. పూజారులు రాహుల్ గాంధీని(Rahul Gandhi Visits) ఆశీర్వ‌దించారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. తాను దేశంలోని ప్ర‌జ‌లంద‌రి కోసం ప్రార్థ‌న‌లు చేశాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సింది మ‌తం కాద‌ని మాన‌వ‌త్వం కావాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇవాల్టితో 130 రోజుల‌కు చేరుకుంది. ఇప్ప‌టికే ఆయ‌న 3,400 కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేప‌ట్టారు.

గ‌త ఏడాది 2022 సెప్టెంబర్ 7న త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున జ‌నాద‌ర‌ణ ల‌భించింది. వేలాదిగా భార‌త్ జోడో యాత్ర‌లో పాలు పంచుకున్నారు. అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు రాహుల్ గాంధీతో క‌లిసి అడుగులో అడుగు వేశారు.

రాహుల్ గాంధి ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్, ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల‌లో త‌న యాత్ర పూర్త‌యింది. ప్ర‌స్తుతం క‌ల్లోల కాశ్మీర్ లో కొన‌సాగుతోంది. ఈనెల 31న భార‌త్ జోడో యాత్ర పూర్త‌వుతుంది. అనంత‌రం స‌భ జ‌ర‌గ‌నుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో. దేశంలోని 24 పార్టీల‌కు చెందిన నాయ‌కులు హాజ‌రు కానున్న‌ట్లు స‌మాచారం.

Also Read : రాహుల్ యాత్ర‌కు భారీ భ‌ద్ర‌త

Leave A Reply

Your Email Id will not be published!