Rahul Gandhi : ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ కంగ్రాట్స్
ఇకనైనా స్వేచ్చగా ఉంటుందని అనుకుంటున్నా
Rahul Gandhi : ప్రపంచ వ్యాప్తంగా కుల, మతాలు, జాతులకు అతీతంగా తమ అభిప్రాయాలను నిర్భయంగా పంచుకునే ఏకైక వేదిక ట్విట్టర్. సామాజిక మాధ్యమాలు ఎన్ని ఉన్నా అన్నీ ట్విట్టర్ ముందు దిగదుడుపే. ట్విట్టర్ లో కీలక పరిణామాలు చేసుకున్నాయి. 4,470 కోట్లకు పైగా ఖర్చు చేసి ట్విట్టర్ ను స్వంతం చేసుకున్నారు ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.
గత కొంత కాలం నుంచీ దానిని కొనుగోలు చేయాలా వద్దా అన్న దానిపై కొంత ఉత్కంఠకు దారి తీసేలా చేశాడు ఎలాన్ మస్క్. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. వచ్చీ రావడంతోనే సిఇఓ పరాగ్ అగర్వాల్, సిఎఫ్ ఓ సెగెల్ , లీగ్ హెడ్ విజయా గద్దెలను దించేశాడు.
ఆపై వారందరికీ సంస్థ తరపున ఏకంగా $100 మిలియన్లను చెల్లించనున్నాడు ఎలాన్ మస్క్. పరాగ్ కు $50 మిలియన్లు, సగెల్ కు $37, విజయా గద్దెకు $17 మిలియన్లు అందుకోనున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ట్విట్టర్ ఇక నుంచి స్వేచ్ఛగా తన అభిప్రాయాలు తెలియ చేస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపాడు.
రేప్ బాధితురాలి పోటోను షేర్ చేయడం కలకలం రేపింది. ఈ సందర్బంగా ఢల్లీ మహిళా కమిషన్ నోటీసు కూడా పంపింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన యాత్ర పాలమూరు జిల్లాలో కొనసాగుతోంది.
ఈ తరుణంలో ఎలాన్ మస్క ను అభినందిస్తూ ట్వీట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : సమిష్టి కృషితో ఆర్థిక శక్తిగా భారత్