Rahul Gandhi: పదేళ్లలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది: అమెరికాలో రాహుల్ గాంధీ కిలక వ్యాఖ్యలు

పదేళ్లలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది: అమెరికాలో రాహుల్ గాంధీ కిలక వ్యాఖ్యలు

Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యం తన మనుగడ కోసం పోరాటం చేస్తోందని, ఆ పోరాటంపై తనకు విశ్వాసం ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. భాజపా విధానాలను దుయ్యబట్టారు. గడచిన పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం నిలదొక్కుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi Comment

ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దానిని పడగొడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మా నుంచి దూరం చేశారు. అదంతా నా కళ్ల ముందే జరిగింది. మా శాసనసభ్యులు అనూహ్యంగా భాజపా సభ్యులయ్యారు. దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. బలహీనంగా మారిపోయింది. ఇప్పుడు దానిని నిలబెట్టేందుకు పోరాటం జరుగుతోంది అని రాహుల్(Rahul Gandhi) అన్నారు. ఎన్నికల ఫలితాలు చూస్తే.. భారత ప్రజాస్వామ్యంపై మరింత ఆశ కలుగుతోందన్నారు. మేం ఎన్నికల్లో పోటీ చేసేముందు మా పార్టీ బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించాయి.

నాపై దాదాపు 20 కేసులు పెట్టారు. భారతదేశ చరిత్రలో పరువునష్టం కేసులో జైలు శిక్షను ఎదుర్కొన్న ఏకైక వ్యక్తిని నేనే. మా ముఖ్యమంత్రి ఒకరు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. కానీ మాకు భారతీయ ఓటరు ఉన్నాడు. అతడు రాయివలే దృఢంగా నిలబడి ఉన్నాడు. కానీ అతడు పనిచేయడానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ అక్కడ లేదు అని రాహుల్ వ్యాఖ్యానించారు.

అలాగే ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. 21వ శతాబ్దంలో ఆధునిక దేశ ప్రధానమంత్రి ఒకరు.. నేను దేవుడితో మాట్లాడుతున్నానని చెప్తున్నారు. నేను అందరికంటే భిన్నం అంటారు. తనని తాను జీవసంబంధమైన వ్యక్తిని కాదంటారు. ఆ ప్రధానిని మేం ఓడించామని మాకు తెలుసు అని తెలిపారు. అలాగే ప్రజాస్వామ్యంలో వ్యవస్థల పనితీరు దెబ్బతినడం వల్ల తాము జోడో యాత్ర చేయవలసి వచ్చిందని వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలతో మమేకం కావడం మినహా మాకు మరోమార్గం కనిపించలేదన్నారు.

Also Read : Encounter : కథువా ఎన్ కౌంటర్ లో ఇద్దరు పాక్ ఉగ్రవాదుల దుర్మరణం

Leave A Reply

Your Email Id will not be published!