Rahul Gandhi Dials : ప‌వార్ వ్య‌వ‌హారం రాహుల్ జోక్యం

సుప్రియా సూలేకు గాంధీ ఫోన్

Rahul Gandhi Dials : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi Dials) శ‌ర‌ద్ ప‌వార్ ఆక‌స్మిక రాజీనామా త‌ర్వాత సుప్రియా సూలేకు ఫోన్ చేశారు. ప‌వ‌ర్ మ‌రోసారి ఆలోచించాల‌ని సూచించారు. ఇటీవ‌లే తాను నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , మాజీ కేంద్ర మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ తాను పార్టీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీంతో మ‌రాఠా రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ఎన్సీపీ మ‌హా ఘ‌ట్ బంధ‌న్ గా ప‌ని చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. షిండే , బీజేపీ స‌ర్కార్ ప్ర‌స్తుతం కొలువు తీరింది.

ప్ర‌స్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్ , శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీలు క‌లిసి కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలో గ‌త కొంత కాలం నుంచి అటు దేశ రాజ‌కీయాల‌లో ఇటు రాష్ట్ర పాలిటిక్స్ లో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు రాజ‌కీయ దురంధురిడిగా పేరు పొందిన శ‌ర‌ద్ పవార్. కాగా ఉన్న‌ట్టుండి ఈ రాజీనామా ప్ర‌క‌ట‌న ఎందుకు చేశార‌నే దానిపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. అంతే కాకుండా ఓ క‌మిటీని కూడా వెల్ల‌డించాడు.

ప్ర‌స్తుతం శ‌ర‌ద్ ప‌వార్ కూతురు , లోక్ స‌భ స‌భ్యురాలు సుప్రియా సూలే మ‌రో వైపు అజిత్ ప‌వార్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఆమెకు ఫోన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ఎన్సీపీ జాతీయ చీఫ్ గా సుప్రియా సూలే , మ‌హారాష్ట్ర యూనిట్ చీఫ్ గా ప‌వార్ మేన‌ల్లుడు అజిత్ ప‌వార్ ఎన్నికైన‌ట్లు టాక్.

Also Read : రెజ్ల‌ర్ల కేసుపై సుప్రీంకోర్టు విచార‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!