Rahul Gandhi: ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ డుమ్మా
ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ డుమ్మా
Rahul Gandhi : భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గైర్హాజరు కావడంపై బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. కొన్ని రోజుల కిందట ఎర్ర కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. భారత రాజ్యాంగాన్ని అవమానించే వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటానికి అర్హత ఉందా?’’ అని భండారి మండిపడ్డారు.
Rahul Gandhi Escape
‘‘రాహుల్‌కు (Rahul Gandhi) సెలవుల్లో మలేషియాకి వెళ్లడానికి సమయం ఉంది. కానీ.. అధికారిక రాజ్యాంగ కార్యక్రమానికి రావడానికి తీరిక లేదా?రాహుల్ భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఆయన భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. మరోపక్క.. ఎన్డీయే కూటమిలోని శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయకూడదని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ మాట్లాడుతూ..‘‘ప్రతిపక్ష నేత ప్రతి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలనే నిబంధన లేదు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్, పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. భాజపానే రాజ్యాంగాన్ని ద్వేషిస్తోంది. వారు రాజ్యాంగాన్ని తారుమారు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
Also Read : Supreme Court: సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం
