Rahul Gandhi: రాహుల్ ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య
రాహుల్ ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య
Rahul Gandhi : మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మంగళవారంనాడు ప్రకటించారు. సనాతన ధర్మానికి మనుస్మృతి పునాది అని, లోక్‌సభలో మనుస్మృతిని కించపరుస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేసారని ఆయన తెలిపారు. కంఖాల్‌లోని శంకరాచార్య మఠంలో అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ, ఈ విషయంలో క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీకి(Rahul Gandhi) తాము నోటీసు కూడా ఇచ్చామని, అయితే తమకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. దీనితో లాంఛనంగా ఆయనను హిందూమతం నుంచి శంకరాచార్య మఠం బహిష్కరిస్తున్నట్టు తెలిపారు.
రాహుల్ గాంధీ ఈ ఏడాది మొదట్లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో బీజేపీపై విరుచుకుపడుతూ, ఆ పార్టీ నేతలు మనుస్మృతిని అనుసరిస్తారని, భారత రాజ్యాంగాన్ని కాదని అన్నారు. హథ్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని తాను కలుసున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబ సభ్యులు ఇల్లు విడిచి బయటకు వెళ్లలేకపోతున్నారని, నిందితులు మాత్రం రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. ”నిందితులు రోడ్లపై స్వేచ్ఛగా తిరగవచ్చని రాజ్యాంగంలో ఎక్కడ రాసుంది? ఇది మీ పుస్తకం మనస్మృతిలో ఉంది” అని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi – పహల్గాం ఉగ్రదాడిపై మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు
పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాంలో మరింత భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ‘సంవిధాన్ బచావో’ పేరుతో రాంచీ వేదికగా నిర్వహించిన సభలో ఖర్గే ఈ విధంగా స్పందించారు. ‘‘దేశంలో పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఇంటెలిజెన్స్‌ను పటిష్ఠ పరచుకుంటామని వాళ్లే చెప్పారు. దాడికి మూడు రోజుల ముందే నిఘా సమాచారం ఉందని నాకు తెలిసింది. అలాంటప్పుడు పహల్గాంలో తగినంత భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నా ’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
ఏదేమైనా పహల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌పై ఎటువంటి చర్య తీసుకున్నా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని మల్లికార్జున ఖర్గే మరోసారి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశమే తొలి ప్రాధాన్యమన్నారు. రాజకీయ విభేదాలకంటే జాతీయ ఐక్యతే ముఖ్యమన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఖర్గే.. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడమే మోదీ విధానమని ఆరోపించారు. ఆదివాసీ నేతలను భయపెట్టే ధోరణిని అవలంబించకూడదని కేంద్రానికి సూచించారు.
Also Read : Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్”