Rahul Gandhi: ‘కుల గణన’పై బీజేపీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ !

‘కుల గణన’పై బీజేపీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ !

Rahul Gandhi: బీజేపీ బహుజన వ్యతిరేకి అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా… రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు. ‘కుల గణన’ పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని, బహుజనులు వారి హక్కులను పొందడం బహుశా ఇష్టం లేదేమోనని సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించారు.

Rahul Gandhi Comment

‘‘బహుజన వ్యతిరేక బీజేపీ ఎన్ని అబద్ధాలు వ్యాప్తి చేసినా రిజర్వేషన్లకు నష్టం జరగనివ్వం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి సమగ్ర కులగణన జరిపి ప్రతీ వర్గానికి హక్కులు, వాటా, న్యాయం జరిగేవరకు ఆగబోము’’ అని రాహుల్‌(Rahul Gandhi) అన్నారు. కులగణన అనేది దేశంలోని రాజకీయ సమస్య మాత్రమే కాదని, వెనకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీ ఇప్పటికే పలుమార్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం భారత్‌ లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. అప్పటివరకు అభివృద్ధిలో వారి భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉందన్నారు. దేశంలో అన్నివర్గాల వారికీ పారదర్శకంగా అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. దీనితో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాహుల్‌ పై విమర్శలు వచ్చాయి. దీనితో ఆయన తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : Atishi Marlena: పక్కన ఖాళీ కుర్చీతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ !

Leave A Reply

Your Email Id will not be published!