Rahul Gandhi: బైక్‌ కోల్పోయిన వ్యక్తి కొత్త బైక్‌ ను ఇచ్చిన రాహుల్‌ గాంధీ

బైక్‌ కోల్పోయిన వ్యక్తి కొత్త బైక్‌ ను ఇచ్చిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : ఓటర్‌ అధికార్‌ యాత్రలో భాగంగా బైక్ ర్యాలీలో… తన బైక్‌ను కోల్పోయిన హోటల్‌ యజమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొత్త బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆగస్టు 27న దర్భంగాలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రోడ్‌షో, ర్యాలీ నిర్వహించగా… సమీపంలో పార్క్ చేసిన బైక్‌లను భద్రతా సిబ్బంది ఆ ర్యాలీకి ఉపయోగించారు. వాటిలో ఆ హోటల్‌ యజమాని శుభమ్‌ కు చెందిన పల్సర్‌ 220 బైక్‌ కూడా ఉంది.

Rahul Gandhi Helps

శుభమ్‌ తెలిపిన వివరాల ప్రకారం… మొదట భద్రతా సిబ్బంది టీ తాగడానికి ఆగారు. కొంత సమయం తర్వాత రోడ్‌ షో కోసం బైక్స్‌ కావాలని కోరారు. ఈ రోడ్‌ షో కేవలం 1.5 కిలో మీటర్ల మాత్రమే ఉంటుందని తర్వాత తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. భద్రతా బృందం అతన్ని కూడా తన బైక్‌పై తీసుకెళ్లింది. కానీ తర్వాత ఎస్‌యూవీకి మారమని కోరారు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే రోడ్‌షో ముగిసిన తర్వాత తన బైక్‌, భద్రతా సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. తర్వాత సిబ్బంది ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో తన బైక్‌ కనిపించలేదు.

ఈ విషయం కాంగ్రెస్‌ నాయకుడు దేవేంద్ర యాదవ్‌కు తెలిసింది. వెంటనే అతన్ని పట్నాకు రావాలని ఆహ్వానించారు. ఓటర్ అధికార్‌ యాత్ర ముగింపు కార్యక్రమ వేదికపై రాహుల్‌ గాంధీ స్వయంగా తనకు కొత్త బైక్‌ తాళాలు అందించినట్లు శుభమ్‌ తెలిపారు. ర్యాలీలో తను కోల్పోయిన బైక్‌ మోడల్‌నే బహుమతిగా ఇచ్చారని ధాబా యజమాని శుభమ్‌ మీడియాకు తెలిపారు.

Also Read : CM Chandrababu : ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ తీసుకొస్తాం

Leave A Reply

Your Email Id will not be published!