Rahul Gandhi: వయనాడ్ విషాదం లో వందలాది మంది మృతి చెందారు.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి
వయనాడ్ విషాదం లో వందలాది మంది మృతి చెందారు.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది మృతి చెందారు. మరి కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్రాన్ని కోరారు.
Rahul Gandhi Comment
రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో జీరో అవర్లో మాట్లాడుతూ.. ‘కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించాను. ఈ ఉత్పాతం జరిగిన ప్రదేశంలో కీలకమైన రహదారులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 200 మందికి పైగా మృతి చెందగా చాలా మంది ఆచూకి తెలియలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, సమగ్ర పునరావాసాన్ని కల్పించాలి’ అని కోరారు. సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశంసించారు.
Also Read : Ys Jagan: చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా అంతే… నాయకులైనా అంతే : వైఎస్ జగన్