Rahul Gandhi: అమిత్ షాకు రాహుల్ గాంధీ ఫోన్ ! పహల్గాం ఉగ్రదాడి గురించి ఆరా !
అమిత్ షాకు రాహుల్ గాంధీ ఫోన్ ! పహల్గాం ఉగ్రదాడి గురించి ఆరా !
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన భారత్ సహా యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ… కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన విపక్ష నేతలు… బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరారు.
Rahul Gandhi Call to Amit Shah
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ… ఈ ఉదయం దీనిపై పోస్ట్ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరగాలని పిలుపునిచ్చారు.
అటు ఖర్గే కూడా మంగళవారం రాత్రి అమిత్ షా, ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ‘‘సీమాంతర ఉగ్రవాదానికి తగిన విధంగా బదులివ్వాల్సిందే. అమాయక పౌరుల ప్రాణాలు తీసిన ముష్కరులను కఠినంగా శిక్షించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.